క్యాసినో గేమ్ ఆడిపించడంలో బ్రాండ్ అంబాసిడర్ గా పేరు పొందిన్ చికోటి ప్రవీణ్ అందరికి సుపరిచితుడే. చికోటి ప్రవీణ్ తెలుగు రాష్ట్రలో కాకుండా బయటి దేశంలో కూడా క్యాసినో గేమ్ అడిస్తుంటాడు. అయితే ఇక్కడి తెలుగు రాష్ట్రాలకు చెందినా వ్యక్తుల తో థాయ్ ల్యాండ్ లో ఆడిపిస్తుండగా థాయ్ ల్యాండ్ పోలీస్ లకు అడ్డంగా దొరికి అరెస్ట్ అయ్యాడు. కఠిన చట్టాలు ఉన్నాయని తెలిసినా థాయ్ ల్యాండ్ లో క్యాసినో ఆడిపించడం ఏంటి…?అనేది పెద్ద ప్రశ్న గా మారింది.
ఎప్పుడైనా అధికారికంగా అనుమతులు ఉన్న చోటే ఇలాంటి వాటికీ ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే మన దేశంలో గోవా లాంటి ప్లేసులో అడిపించాలి తప్ప.ఎక్కడ పడితే అక్కడ ఇష్టం ఉన్న చోట అడిపిస్తీ ఇలాగే జరుగుతుంది. ఇలా క్యాసినో గేమ్ లో ఆరితేరిన చికోటి ప్రవీణ్ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.ఇతను ఆడించే క్యాసినో వందలో,వేలో కాదు లక్షల లో ఉంటుంది మరి. అంటే క్యాసినో గేమ్ లో ఒక రౌండ్ కు 20కోట్ల మేరకు పందెం కడతారని తెలుస్తుంది.
ఇలా చికోటి ప్రవీణ్ గ్యాంగ్ థాయ్ ల్యాండ్ లో ఏడు అంతస్తులు 300 గదులు ఉన్నఓ స్టార్ హోటల్ లో క్యాసినో జూదం ఆడుతుండగా థాయ్ ల్యాండ్ పోలీస్ లకు అడ్డంగా దొరికి అరెస్ట్ అయ్యారు. పక్క భారత్ నుంచి థాయ్ ల్యాండ్ పోలీస్ లకు అందినా సమాచారం మేరకే చికోటి ప్రవీణ్ అతని గ్యాంగ్ ను అరెస్ట్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి.100 మంది అరెస్టు కాగా.. అందులో 16 మంది ఉమ్మడి కృష్ణా జిల్లాలకు చెందిన వారు కాగా.. అరెస్టు అయిన వారిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు పెద్ద ఎత్తున ఉన్నారు.
ఇలా క్యాసినో ఆడుతున్నా సమయంలో పోలీసుల్ని చూసినంతనే పరుగులు తీస్తూ తప్పించుకోవటానికి ప్రయత్నించారని… కానీ వారిని తప్పించుకోవటం సాధ్యం కాలేదంటున్నారు. పరిస్థితిని అదుపులోకి వచ్చి.. అందరిని ఒక చోట కూర్చోబెట్టటానికి చాలా సమయం తీసుకున్నట్లు చెబుతున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని ఒకేచోటకు తరలించకుండా మూడు వేర్వేరు చోట్లకు తరలించారని చెబుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే.. క్యాసినోకు.. జూదానికి థాయ్ లాండ్ లో ఎలాంటి పర్మిషన్ లేదు. కానీ.. అక్కడ అంతా లీగల్ అని నమ్మబలికిన చికోటి ప్రవీణ్ మాటల్ని నమ్మి వచ్చి నిండా మునిగిపోయినట్లు చెబుతున్నారు.