ఆయన కేవలం ఎమ్మెల్యేనే కాదు.. ఏపీ మంత్రి కూడా. కానీ ఎంత పెద్ద పదవి ఉండి ఏం లాభం? పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుంటాయి ఆయన పనులు. అసలు ఆయన గారు చేసే ఘన కార్యాలు చెప్పుకుంటే తుపుక్కున ఉమ్మేస్తారు తెలిసినవారు ఎవరైనా. పైన పటారం లోన లొటారం అన్నట్లు పైకి మంత్రిగా వెలగబెడుతూ లోలోన మాత్రం దందాలు చేస్తూ పైసలు సంపాదిస్తారు. మరే అలాంటి ఇలాంటి దందాలు కాదు ఏకంగా మత్తు మందులు అమ్మే దందాలే. అంటే డ్రగ్స్, గంజాయి లాంటివి అన్నమాట. ఏంటి ఓ రాష్ట్ర మంత్రి మత్తు పదార్థాల వ్యాపారంలో ఉన్నాడా అనే అనుమానాలున్నాయా. అంటే ఆయన నేరుగా చేయకపోవచ్చు గాని చేసేవారంతా ఆయన మనుషులేనని తుని నియోజకవర్గమంతా కోడై కూస్తోంది. మీరు అనుకున్నది కరెక్టే ఆయన మరెవరో కాదు దాడిశెట్టి రామలింగేశ్వర రావు ఊరఫ్ దాడిశెట్టి రాజా ఊరఫ్ గంజాయి రాజా.
దాడిశెట్టి రాజా దందాలు మామూలుగా ఉండయండి మరి. ఏజెన్సీ ప్రాంతాలను తన గుప్పిట్లో పెట్టుకొని మరి కాఫీ తోటలు, టీ తోటల మాదిరి గంజాయి తోటలనే పండిస్తున్నారట. అందుకు అమాయక గిరిజనులను పావులుగా వాడుకుంటున్నారట. కాదని ఎవరైనా ఎదురు తిరిగితే వారి బ్రతుకులు ఛిద్రమే. అంతేకాదు తన దందాకు అడ్డమొచ్చే గిరిజన తెగులను సొంత గూడెం నుంచే తరిమికొట్టే ప్రణాళికలు కూడా రచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం తుని నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల స్థలాలను కూడా కబ్జా చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలా చేయకపోతే ఎక్కడ తన గంజాయి దందాకు సమస్య తలెత్తుతుందోని ముందుగానే వ్యూహాత్మకంగా గిరిజనులను లక్ష్యం చేసుకున్నాడట గంజాయి రాజా ఊరఫ్ దాడిశెట్టి రాజా. అయితే ఆవు కంచెను మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెత లాగా మంత్రి దాడిశెట్టి రాజా బాస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కదా. బాస్ చూపిన బాటలోనే దో నంబర్ దందాలకు తెరలేపాడు.
అయితే దాడిశెట్టి గంజాయి వ్యాపారం కేవలం తుని నియోజకవర్గానికే పరిమితమైందనుకుంటే మీరు పొరబడినట్లే. తుని కేంద్రంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించిందట. అంటే రాష్ట్ర స్థాయిలో ఆగిపోయిందనుకోగలరు. పక్క రాష్ట్రాలకు కూడా తుని కేంద్రంగానే గంజాయి స్మగ్లింగ్ అవుతున్నట్లు పలుమార్లు బహిర్గతమైంది. అయినా తమ బాస్ జగన్ మోహన్ రెడ్డి దివ్య ఆశీస్సులతో గంజాయి దందాను మూడు పువ్వులు, ఆరు కాయలుగా చేసుకుంటున్నారు ఈ గంజాయి రాజా ఊరఫ్ దాడిశెట్టి రాజా. ఇలాంటి కేడీ మన కాకినాడ జిల్లాలో ఉండడం నిజంగా ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమే అనాలి మరి. ఈ కేడీ రౌడీ దాడిశెట్టి రాజాతో జాగ్రత్త.