• Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad
  • Graduate MLC
  • About
  • Contact

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

సింగపూర్ ఆసక్తి, Semicon 2.0 అవకాశం: తెలంగాణ చిప్ పరిశ్రమ కలను పెట్టుబడిగా మార్చేది ఏమిటి?

September 17, 2026

22A భూముల వివాదం: ఎర్రవల్లి ఫాంహౌస్‌పై 30 రోజుల్లో నిజనిర్ధారణకు సీఎం ఆదేశం

September 16, 2026

లోత్‌కుంట 40 ఎకరాల కేసు: సుప్రీంకోర్టు తీర్పు ‘మెరిట్స్’పై కాదు.. 219 రోజుల ఆలస్యమే కీలకం

September 16, 2026
Facebook Twitter Instagram
Polytricks.in
  • Polytricks
  • AndhraPradesh
  • Telangana
  • Contact
Facebook Twitter Instagram YouTube WhatsApp
SUBSCRIBE
  • Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad
  • Graduate MLC
  • About
  • Contact
Polytricks.in
Home » సీతా దయాకర్ రెడ్డి దంపతులు మళ్ళీ రావాలి – మక్తల్ లో వెలసిన పోస్టర్లు
News

సీతా దయాకర్ రెడ్డి దంపతులు మళ్ళీ రావాలి – మక్తల్ లో వెలసిన పోస్టర్లు

Prashanth PagillaBy Prashanth PagillaFebruary 20, 2023Updated:February 20, 2023No Comments1 Min Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న సీతాదయాకర్ రెడ్డి దంపతులు మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలంటూ మక్తల్ పట్టణంలో పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లను ఎవరు అతికించారో సరిగ్గా తెలియదు కానీ ” అసమర్ధులు, అవినీతిపరుల చేతిలో బందీ అయిన మక్తల్ , దేవరకద్ర నియోజకవర్గాల సంకెళ్ళు తొలగించి ఈ నియోజకవర్గాల పూర్వ వైభవం కోసం మీరు మళ్ళీ రావాలి” అని అతికించిన పోస్టర్ లో ఇట్లు మీ అభిమానులు అని ఉండటంతో ఇదంతా సీతా దయాకర్ రెడ్డి అభిమానుల పనేనని తెలుస్తోంది.

టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించిన సీతా దయాకర్ రెడ్డి దంపతులు ఏ పార్టీలోనూ చేరలేదు. ప్రధాన పార్టీల నుంచి సీతా దయాకర్ రెడ్డి దంపతులకు ఆహ్వానం అందింది. కానీ వారు మాత్రం ఎటుతేల్చుకోలేకపోతున్నారు. వారి అభిమానులు, క్యాడర్ నుంచి రోజురోజుకు ఒత్తిళ్ళు పెరుగుతున్నాయి. మీ వెంటే మేమూ అంటూ అభిమానులు వరుస ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీతా దయాకర్ రెడ్డి దంపతులు త్వరలోనే ఏ పార్టీలో చేరనున్నామనేది ప్రకటిస్తామని వెల్లడించారు.

ఇటీవల దయాకర్ రెడ్డి ఆరోగ్యం బాగోలేదని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరని నియోజకవర్గంలో ఆయన ప్రత్యర్ధి వర్గం ప్రచారం చేసింది. తాను వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో ఉంటానని.. తను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే సీతా దయాకర్ రెడ్డి దంపతులపై ఒత్తిడి పెంచేందుకు వారి అభిమానులు ఈ పోస్టర్లు అంటించినట్లు అర్థం అవుతోంది. తాజాగా పోస్టర్లు వెలవడంతో ఆయన మరికొద్ది రోజుల్లోనే ఏ పార్టీలో చేరనున్నారనేది అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Prashanth Pagilla

Related Posts

సింగపూర్ ఆసక్తి, Semicon 2.0 అవకాశం: తెలంగాణ చిప్ పరిశ్రమ కలను పెట్టుబడిగా మార్చేది ఏమిటి?

September 17, 2026

22A భూముల వివాదం: ఎర్రవల్లి ఫాంహౌస్‌పై 30 రోజుల్లో నిజనిర్ధారణకు సీఎం ఆదేశం

September 16, 2026

లోత్‌కుంట 40 ఎకరాల కేసు: సుప్రీంకోర్టు తీర్పు ‘మెరిట్స్’పై కాదు.. 219 రోజుల ఆలస్యమే కీలకం

September 16, 2026

Comments are closed.

Don't Miss
Business

సింగపూర్ ఆసక్తి, Semicon 2.0 అవకాశం: తెలంగాణ చిప్ పరిశ్రమ కలను పెట్టుబడిగా మార్చేది ఏమిటి?

September 17, 20260

సింగపూర్ ప్రతినిధుల ఆసక్తి, కేంద్ర Semicon 2.0 కార్యక్రమం తెలంగాణకు కొత్త అవకాశం తెచ్చాయి. కానీ ప్లాంట్ ఇంకా ఖరారు కాలేదు. ప్రకటన నుంచి నిజమైన పెట్టుబడి, ఉత్పత్తి, ఉద్యోగాల దిశగా అవసరమైన చర్యలపై Polytricks విశ్లేషణ.

22A భూముల వివాదం: ఎర్రవల్లి ఫాంహౌస్‌పై 30 రోజుల్లో నిజనిర్ధారణకు సీఎం ఆదేశం

September 16, 2026

లోత్‌కుంట 40 ఎకరాల కేసు: సుప్రీంకోర్టు తీర్పు ‘మెరిట్స్’పై కాదు.. 219 రోజుల ఆలస్యమే కీలకం

September 16, 2026

సెప్టెంబర్‌ 17 ఎవరి కథనం? ‘ప్రజాపాలన’ వర్సెస్‌ ‘విమోచన’… తెలంగాణలో కొత్త రాజకీయ పోరు

September 16, 2026
Stay In Touch
  • Facebook 1000K
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo
  • WhatsApp
Our Picks

సింగపూర్ ఆసక్తి, Semicon 2.0 అవకాశం: తెలంగాణ చిప్ పరిశ్రమ కలను పెట్టుబడిగా మార్చేది ఏమిటి?

September 17, 2026

22A భూముల వివాదం: ఎర్రవల్లి ఫాంహౌస్‌పై 30 రోజుల్లో నిజనిర్ధారణకు సీఎం ఆదేశం

September 16, 2026

లోత్‌కుంట 40 ఎకరాల కేసు: సుప్రీంకోర్టు తీర్పు ‘మెరిట్స్’పై కాదు.. 219 రోజుల ఆలస్యమే కీలకం

September 16, 2026

సెప్టెంబర్‌ 17 ఎవరి కథనం? ‘ప్రజాపాలన’ వర్సెస్‌ ‘విమోచన’… తెలంగాణలో కొత్త రాజకీయ పోరు

September 16, 2026

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

Facebook Twitter Instagram Pinterest
  • Home
  • AndhraPradesh
  • Telangana
  • News
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks. Designed by Polytricks.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version