Polytricks.in

పిల్లలతో బీఆర్ఎస్‌ విష రాజకీయం? సన్నబియ్యం సంబురాలపై విషం కక్కుతున్న పింకీస్

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురి ప్రభుత్వ పాఠశాల ట్యాంకులో విషం కలిపిన ఘటన వెనుక తవ్వేకొద్దీ సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సిబ్బంది అప్రమత్తతతో 80 మంది పిల్లల ప్రాణాలు నిలిచాయి. కానీ ఒకవేళ ఎవరూ గమనించకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది. అయితే ఈ ఘటన ఎవరో మతిస్థిమితం లేని వ్యక్తి చేసిందిగా ప్రచారం జరుగుతున్నప్పటికీ…లోతుగా ఆలోచిస్తే దీని వెనుక పెద్ద కుట్రే ఉన్నట్లు అనుమానం వ్యక్తం అవుతోంది. రేవంత్‌రెడ్డి సీఎం అయినప్పటి నుంచి గురుకులాల్లో అక్కడక్కడా ఫుడ్ పాయిజన్ ఘటనలు వరుసగా జరుగడం, ఈ విషయం పిల్లల పేరెంట్స్ కంటే ముందుగానే బీఆర్ఎస్‌ నేతలకు తెలియడం, వారు అక్కడికి వెళ్లి హడావుడి చేయడం అంతా పక్కా పథకం జరిగిందని జగమెరిగిన సత్యం. బీఆర్ఎస్ వికృత క్రీడ కోసం పిల్లలను అడ్డం పెట్టుకోవడం ఇది మొదటిసారి కాదు…ఆ పార్టీ ఉనికి కోల్పోతుందన్న ప్రతీసారి యువతను రెచ్చగొట్టడం, అమాయక జనం ఉద్వేగాలతో ఆడుకోవడం జరుగుతూనే ఉంది. ఇక గురుకులాల్లో గ్యాప్ లేకుండా ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్‌లో చేరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్ హస్తం ఉందనే అనుమానాలు చాలానే వ్యక్తం అయ్యాయి. గతంలో గురుకులాలతో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధాలు, ఫుడ్‌ కాంట్రాక్టర్లతో ఆయనకు పరిచయాలను ఉపయోగించుకొని కుట్ర చేశారని బీఆర్‌ఎస్ పార్టీ వర్గాల ద్వారానే లీక్ అయింది.

గురుకులాల్లో ఫుడ్ పాయిజన్‌ ఘటనలతో ప్రభుతవ్ం సీరియస్‌గా తీసుకొని డైట్‌ చార్జీలు పెంచడం, నాణ్యతపై నిఘా పెట్టడంతో బీఆర్ఎస్ ఆటలు సాగలేదు. దీంతో వెంటనే లగచర్లతో కలెక్టర్‌తో పాటూ ప్రభుత్వ అధికారులపై దాడి చేయడం, వారిని అంతమొందించేందుకు కుట్రలు చేయడం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టుతో బీఆర్‌ఎస్ కుట్రపై ప్రజల్లో కూడా క్లారిటీ వచ్చింది.

మొన్నటికి మొన్న కంచె గచ్చిబౌలి భూములను ప్రైవేటుపరం కాకుండా కాపాడుతుంటే…రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బురద జల్లేందుకు కోట్లు ఖర్చు చేసింది బీఆర్ఎస్‌ పార్టీ. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి ఫేక్ వీడియోలు, ఫోటోలతో మొత్తం దేశాన్ని నమ్మించే యత్నం చేసింది.

https://polytricks.in/brs-conspiracy-behind-gurukul-food-poisoning/

ప్ర‌జా ప్ర‌భుత్వ విజ‌యోత్స‌వాల‌ను నీరుగార్చేందుకు BRS కుట్ర‌, బీఆర్ఎస్ ర‌హ‌స్య ఎజెండా ఇదే!

ఇప్పుడు ఇచ్చోడలో 80 మంది చిన్నారులున్న ప్రభుత్వ పాఠశాల వాటర్‌ ట్యాంకులో పురుగుల మందు కలిపి, వారిని పావులుగా ఉపయోగించి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసేందుకు కుట్ర జరిగిందా? అనే అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

బీఆర్ఎస్ క్షుద్ర రాజకీయాలు తెలిసిన వారు మాత్రం ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పనే అయి ఉంటుందని నమ్ముతున్నారు. అధికారం కోల్పోగానే విచక్షణ కోల్పోవడం సరికాదు. పిల్లల ప్రాణాలను పణంగా పెట్టి రాజకీయాలు చేయడం అస్సలు మంచిది కాదని బీఆర్ఎస్ నేతలకు మేధావులు సూచిస్తున్నారు.

Exit mobile version