Site icon Polytricks.in

అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ దూకుడు – అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారంటే..?

తెలంగాణలో ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేశాయి. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. ఈ నెలలో 80మందితో మొదటి జాబితాను కేసీఆర్ ప్రకటించనున్నారు. అయితే, బీఆర్ఎస్ కు పోటీగా అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్ కూడా సై, సై అంటోంది.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసినట్లు టి. కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ నెల చివరి నాటికి 80మంది పేర్లను అభ్యర్థులుగా ప్రకటిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే పేర్కొన్నారు. ఏకాభిప్రాయం కుదిరిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించడం వలెనే గత ఎన్నికల్లో నష్టపోయామని కాంగ్రెస్ అనుకుంటోంది.

Also Read : 50 మందికిపైగా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఎమ్మెల్యేలు వీరే ..!!?

ఈసారి ఆలస్యం చేయకుండా తొందరగానే అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ ఫిక్స్ అయింది. ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీమ్ సర్వేలు చేసింది. వడపోతల అనంతరం జాబితాను ఏఐసీసీకి పంపి.. ఆ తరువాత ఏఐసీసీ ఆమోదం తరువాత టీపీసీసీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించనుంది. అభ్యర్థుల ఎంపికతోనే తాము ఎంత దూకుడుగా ఉన్నామో బీఆర్ఎస్ కు స్పష్టమైన హెచ్చరికలు పంపాలని కాంగ్రెస్ భావిస్తోంది.

గత ఎన్నికల్లో జరిగిన పొరపాటును పునరావృత్తం చేయవద్దని కాంగ్రెస్ అనుకుంటోంది. అందుకే ఈ సాధ్యమైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రణ క్షేత్రంలోకి వెళ్లాలని డిసైడ్ అయింది.

Also Read : ఏఐసీసీకి అందిన ఎస్కే టీమ్ నివేదిక – ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..!?

Exit mobile version