Site icon Polytricks.in

ఏఐసీసీకి అందిన ఎస్కే టీమ్ నివేదిక – ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..!?

ఎన్నికల నోటిఫికేషన్ ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని టి. కాంగ్రెస్ భావిస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లను ముందుగా ప్రకటించలేదు కానీ నియోజకవర్గాల్లో పని చేసుకోవాలని అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. కర్ణాటక ఎన్నికల పాలసీని తెలంగాణలోనూ అనుసరించాలని ఏఐసీసీ నుంచి టి. కాంగ్రెస్ కు ఆదేశాలు అందాయి.

సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపికను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీమ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల బలాబలాలు, బలహీనతలు గుర్తించినట్లు సమాచారం. అన్ని అంశాలను పరిశీలించిన ఎస్కే టీం చివరికి అనేక వడపోతల అనంతరం గెలుపు గుర్రాల జాబితాను ఏఐసీసీకి అందజేసినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు పాత మొహాలకే గెలుపు అవకాశాలు ఉన్నట్లు సర్వేలో తేలినట్లు సమాచారం. అందుకే రెండు మూడు స్థానాల్లో ప్రత్యామ్నాయ అభ్యర్థుల పేర్లను సూచించిన ఎస్కే టీం దాదాపుగా పాత వారందరి పేర్లను జాబితాలో చేర్చింది. ఉమ్మడి పాలమూరులోని 14 నియోజకవర్గాల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో చూద్దాం.

మహబూబ్ నగర్ : ఒబెదుల్లా కోత్వాల్ / ఎం.చంద్రశేఖర్

జడ్చర్ల : అనిరుద్ రెడ్డి / ఎం చంద్రశేఖర్

వనపర్తి : జిల్లెల చిన్నారెడ్డి

మక్తల్ : సీతా దయాకర్ రెడ్డి/ పోలీసు చంద్రశేఖర్

కొడంగల్ : రేవంత్ రెడ్డి

నారాయణపేట్ : కే. శివ కుమార్

దేవరకద్ర : జి. మధుసూదన్ రెడ్డి

గద్వాల్ : రాజీవ్ రెడ్డి/ పటేల్ ప్రభాకర్ రెడ్డి

ఆలంపూర్ : సంపత్ కుమార్

నాగర్ కర్నూల్ : నాగం జనార్ధన్ రెడ్డి/ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి

అచ్చంపేట : చిక్కుడు వంశీకృష్ణ

కల్వకుర్తి : చల్లా వంశీచంద్ రెడ్డి

షాద్ నగర్ : వీర్లపల్లి శంకర్

కొల్లాపూర్ : జూపల్లి కృష్ణారావు/ కేతూరి వెంకటేష్/జగదీశ్వర్ రావు 

బీసీ సామజిక కోణంలో ఆలోచిస్తే కేతూరి వెంకటేష్ టికెట్ దక్కే అవకాశం మెండుగా ఉంది. ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ తరుఫున బీసీల ప్రాతినిధ్యం తక్కువ ఉంది కనుక ఈ విషయంలో ఒత్తిడి ఉంటే కేతూరికి టికెట్ ఇచ్చి జూపల్లిని పాలమూరుకు పంపించే అవకాశం లేకపోలేదు.

Also Read : వైఎస్సార్ కు నటితో రెండో పెళ్లి – సోషల్ మీడియాను ఊపేస్తోన్న వార్త..!!

Exit mobile version