Site icon Polytricks.in

ఆసుపత్రి బెడ్ పై తారకరత్న – కన్నీరుపెట్టిస్తోన్న ఫోటో

నందమూరి తారకరత్న తొందరగా కోలుకోవాలని అందరూ ప్రార్ధనలు చేస్తున్నారు. తాతయ్య ఆశీస్సులతో తారకరత్న మామూలు మనిషిగా మన ముంగిటకు వస్తాడని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. తారకరత్న కోలుకుంటున్నాడని నందమూరి రామకృష్ణ చెప్పుకొచ్చారు. ఆయన ఆరోగ్యం మెరుగు పడుతుందనే ప్రకటనే అభిమానులను సంతోష సాగరంలో ముంచెత్తింది. అంతలోనే మళ్ళీ షాక్. నారాయణ హృదయాలయ వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ అభిమానులకు షాక్ ఇచ్చింది.

తారక రత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్ తో పాటుఇతర లైఫ్ సప్పోర్ట్ సిస్టమ్స్ అమర్చడం జరిగింది. ఎక్మో చికిత్స జరగలేదు. తారకరత్న హెల్త్ పై కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారు. వైద్యులమైన మాకు కొంచెం ప్రైవసీ ఇవ్వండని హెల్త్ బులెటిన్ లో పొందుపరిచారు. తారకరత్న కోలుకుంటున్నారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పిన కొద్ది గంటల్లోనే వైద్యులు ఈ ప్రకటన చేయడం అభిమానుల ఆనందాన్ని ఆవిరి చేసింది.

నేడు లేదా రేపు తారకరత్న హెల్త్ కండీషన్ పై పూర్తి స్పష్టత రానుంది. ఇదిలా ఉంటే నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఐసీయూ విభాగంలో బెడ్ పై తారకరత్న ఫోటో లీకైంది. ఆసుపత్రిలో చావు – బతుకుల మధ్య పోరాటం చేస్తోన్న నందమూరి తారకరత్న ఫోటో చూస్తుంటే.. అప్రయత్నంగానే కన్నీరు కారుతోంది. హృదయం ద్రవించింది. అచేతన స్థితిలోనున్న తారకరత్నను చూసి అభిమానులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. దేవుని కృపతో కోలుకుని తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు.

Also Read : తారకరత్న హెల్త్ కండిషన్ పై గందరగోళం

Exit mobile version