Polytricks.in

తారకరత్న హెల్త్ కండిషన్ పై గందరగోళం

యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న అకస్మాత్తుగా సోమ్మిసోల్లిపడిపోయిన సంగతి తెలిసిందే. ఆయన్ని మొదట కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు, వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూర్ లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం నారాయణ హృదయాలయఆసుపత్రిలో తారకరత్న చికిత్స పొందుతున్నారు. అయితే.. ఆయన ఆరోగ్యంపై వస్తోన్న రిపోర్టులు, కుటుంబ సభ్యుల ప్రజతనాలు , మీడియాలో వస్తోన్న కథనాలు గందరగోళంగా ఉన్నాయి. తారకరత్న ఆరోగ్యం విషమంగా ఉందని మొదటి నుంచి చెబుతున్నారు. నందమూరి రామకృష్ణ మాత్రం.. తారకరత్న ఆరోగ్యం కుదుటపడుతోందని.. ఎక్మో పెట్టలేదని.. చికిత్స స్పందిస్తున్నారని చెప్పారు.

రామకృష్ణ మాట్లాడిన కొద్దిసేపటికే నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇది రామకృష్ణ మాటలకు పూర్తి భిన్నంగా ఉంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వెల్లడించారు. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స ఇస్తున్నామని, పరిస్థితి క్రిటికల్ గానే వుందని, ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తున్నామని వెల్లడించారు. రామకృష్ణ స్టేట్మెంట్ తో ఊపిరి పీల్చుకున్న అభిమానులు… వైద్యుల ప్రకటనతో గందరగోళానికి గురయ్యారు.

Also Read : తారకరత్నకు అరుదైన వ్యాధి – పరిస్థితి విషమం..!

Exit mobile version