Site icon Polytricks.in

త్రివిక్రమ్ తో కలిసి సునీత సెకండ్ ఇన్నింగ్స్

సింగర్ గా గుర్తింపు పొందిన సునీత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసేందుకు సిద్దమయ్యారంటూ ఫిలింవర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పాటలతో ఇంతకాలం అలరించిన ఆమె సినీ అరంగేట్రం చేయనుందంటున్నారు. స్టార్ హీరో మహేష్ బాబు సినిమాలో సునీత నటించనుందని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో మహేష్‌ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ప్రస్తుతానికి SSMB 28అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు అక్క పాత్ర కోసం చిత్ర యూనిట్ వెతుకులాటలో ఉండగా..సింగర్ సునీత పేరును మహేష్ బాబు సజెస్ట్ చేశారని టాక్. అందుకు డైరక్టర్ త్రివిక్రమ్ కూడా అంగీకరించారని అంటున్నారు. ఇందుకోసమే సునీతను త్రివిక్రమ్ కలిశారని.. సినిమాలో పాత్ర గురించి చెప్పడంతో ఆమె ఒకే చెప్పారని ఫిలింవర్గాల సమాచారం.

మహేష్ బాబు సినిమాలో సింగర్ సునీతకు ఛాన్స్ వచ్చిందనే ప్రచారం నిజమైతే సునీత అభిమానులకు పండగే. ఇప్పటివరకు ఆమె గొంతు మాత్రమే విన్న అభిమానులు తెరపై నేరుగా ఆమెను చూడొచ్చు. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో సింగర్ సునీత నటిస్తే సినిమాకు హైలెట్ అవుతుంది. మరి ఇందులో నిజమెంత అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Also Read : మళ్ళీ తల్లి కాబోతున్న సింగర్ సునీత

Exit mobile version