Site icon Polytricks.in

మళ్ళీ తల్లి కాబోతున్న సింగర్ సునీత

సింగర్ సునీత మళ్ళీ తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. రామ్ – సునీతలు తమ దాంపత్య జీవితానికి గుర్తుగా తల్లిదండ్రులు కావాలని నిర్ణయించుకున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

నిజానికి సునీతకు చిన్న వయస్సులోనే పెళ్లైంది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాని భర్తతో విబేధాలు రావడంతో విడాకులు తీసుకొని వేర్వేరుగా చాలా కాలంపాటు పిల్లలతో కలిసి ఒంటరిగా జీవించారు. ఈ సమయంలో బిజినెస్ మ్యాన్ మ్యాంగో రామ్ – సునీతలు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. తమ పెళ్ళికి పిల్లలు కూడా అంగీకరించారని సునీత చెప్పిన సంగతి తెలిసిందే. పిల్లల ఒత్తిడి కూడా పెళ్లికి ఓ కారణమని ఆమె చెప్పుకొచ్చారు.

నాలుగు పదుల వయస్సులోనున్న వీరు తల్లిదండ్రులు కావాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా సునీత‌కు రీకాన‌లైజేష‌న్ స‌ర్జ‌రీ చేయించార‌న్న పుకార్లు అప్ప‌ట్లో బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తాజా సమాచారం ప్రకారం నిజంగానే ఆమె తల్లి కాబోతున్నట్లు సింగర్స్ సర్కిల్లో చర్చ నడుస్తోంది.

Exit mobile version