Site icon Polytricks.in

వివాదంలో మంగ్లీ…నీలాంటి వాళ్ళ వాళ్ళే అంటూ ట్రోల్స్..!

సింగర్ మంగ్లీ.. పరిచయం అక్కర్లేని పేరు. పండగలు వస్తున్నాయంటే చాలు అందరూ మంగ్లీ పాట కోసం ఎదురుచూసేంతగా ఆమె పాటలుంటాయి. అక్కడక్కడ ఈవెంట్లలోనూ సందడి చేసే మంగ్లీ అందరిలో కలిసిపోతు చలాకీగా ఉంటుంది. అలాంటి మంగ్లీ ఓ మహిళా నెటిజన్ వలన వివాదంలో చిక్కుకుంది.

లిప్ లాక్ చేసిన ఐశ్వర్యరాయ్

మంగ్లీ ఇటీవల ముస్లిం దర్గాను సందర్శించి ప్రార్ధనలు చేసిన ఫోటోలను ఓ మహిళా నెటిజన్ తన సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి రచ్చకు కారణమైంది. హిందువులు ఇలాంటి పనులు మానుకుంటే మంచిది. ముస్లింలు మన దేవాలయాలను సందర్శిస్తారా..? వాళ్ళకున్న కమిట్మెంట్ మనకు లేకపోవడం వలనే హిందువులపై చిన్నచూపు. తప్పు అల్లాది కాదు.. ఇలాంటి సెక్యులర్ హిందువులది. ముస్లింలు వంద శాతం గుడికి రారు.. నీకెందుకు దర్గాలు అంటూ ట్వీట్ చేసింది.

సూపర్ స్టార్ లేడని బాధపడాల్సిన అవసరంలే – ఆర్జీవీ ట్వీట్

అంతే కాకుండా ఆమె చేసిన ఈ పోస్ట్ ను మంగ్లీకి ట్యాగ్ చేసింది. అయితే, మహిళా నెటిజన్ ట్వీట్ పై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది మంగ్లీ చేసింది తప్పేనంటూ కామెంట్స్ చేస్తుండగా…మరికొంతమంది మంగ్లీకి మద్దతు ఇస్తు, విశ్వాసం అనేది ఆమె వ్యక్తిగతమైనది. వాటిని గౌరవించాలంటూ.. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లు దర్గాలను సందర్శించిన ఫోటోలను షేర్ చేస్తూ మంగ్లీకి సపోర్ట్ చేస్తున్నారు.

Exit mobile version