Site icon Polytricks.in

సూపర్ స్టార్ లేడని బాధపడాల్సిన అవసరంలే – ఆర్జీవీ ట్వీట్

టాలీవుడ్ ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ మరణంపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటని సంతాపం తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా..టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ సూపర్ స్టార్ కృష్ణ మృతిపై తనదైన శైలిలో ట్వీట్ చేశాడు.

సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు..!

కృష్ణ గారి మృతిపై చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, స్వర్గంలో కృష్ణ, విజయనిర్మల పాటలు పాడుకుంటూ , డ్యాన్సులు చేస్తూ ఆనందంగా గడుపుతారని అనుకుంటున్నానని ట్వీట్ చేశాడు. అలాగే , మోసగాళ్ళకు మోసగాడు సినిమాలోని డ్యూయెట్ సాంగ్ ను కూడా షేర్ చేశాడు.

ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version