Polytricks.in

పేద విద్యార్థులకు అండగా నిల్చిన సానా సతీష్ బాబు ఫౌండేషన్

నిరుపేద విద్యార్ధులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ అండగా నిలబడింది. బుధవారం వెయ్యి మంది విద్యార్ధులకు విద్యా సంవత్సరం మొత్తం ఉపయోగపడేలా బస్సు పాసులను కాకినాడలోని సంస్థ కార్యాలయంలో అందించింది. ఫౌండేషన్ తరఫున సత్తిబాబు విద్యార్ధులకు బస్సు పాసులను పంపిణి చేశారు.

విద్యార్థులకు బస్సు పాసుల పంపిణీ అనంతరం సత్తిబాబు మాట్లాడారు. పేద విద్యార్థులు బస్సు పాసులు లేక కాలిబాటన నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు చూసి సానా సతీష్ బాబు ఆవేదనకు గురయ్యారని అందుకే విద్యార్థులకు ఉచిత బస్సు పాసుల పంపిణీకి శ్రీకారం చుట్టారని సత్తిబాబు తెలిపారు. ఆర్ధిక పరమైన సమస్యలు విద్యార్థుల చదువుకు అవరోధం కాకూడదనే లక్ష్యంతో బస్సు పాసులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

పేద కుటుంబాల తలరాతలు మారాలంటే చదువుతోనే సాధ్యమని, ఆ చదువుకు ఆర్థిక సమస్యలు భారం కావోద్దని ఆకాంక్షించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్ధులకు ఈ బస్సు పాసులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అన్నారు. ఈ చిరు సాయాన్ని సైతం విద్యార్థులు తమ భవిష్యత్తును మార్చుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగించుకోవాలన్నారు.

Also Read : ప్రజల మధ్యన ఉంటా..ప్రజా సేవకు పునరంకితం అవుతా : సానా సతీష్ బాబు

Exit mobile version