Site icon Polytricks.in

ప్రజల మధ్యన ఉంటా..ప్రజా సేవకు పునరంకితం అవుతా : సానా సతీష్ బాబు

ప్రజల మధ్యన ఉంటూ.. జీవితకాలం ప్రజా సేవకు పునరంకితం అవుతానని సానా సతీష్ బాబు ఫౌండేషన్ వ్యవస్థాపకులు సానా సతీష్ బాబు స్పష్టం చేశారు. సేవా కార్యక్రమాలతో మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్టు తెలిపారు. తన ఇష్టదైవం శ్రీ భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజాసేవకు పునరంకితం కావాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

తన ప్రస్థానానికి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ఆ సంకటహరునికి మొక్కులు చెల్లించుకుని ముందడుగు వేస్తున్నట్టు సతీష్ బాబు తెలిపారు. కాకినాడ, రేచర్లపేటలోని శ్రీ భక్తాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తన జీవితంలోని కొత్త ప్రయాణం విజయవంతం కావాలని మొక్కులు మొక్కారు. దర్శనానంతరం ఆలయ అభివృద్ధికి తనవంతు సాయం చేసిన సతీష్ బాబు ఆలయ అభివృద్ధికి ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సతీష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

త్వరలోనే మెగా జాబ్ మేళ
శుభకళ ట్రైలరింగ్ అండ్ గార్మెంట్స్ సందర్శన అనంతరం సతీష్ బాబు, స్కిల్ పండిట్ అనే కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ సెంటర్ ను సందర్శించి యువతతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఉద్యోగాలు లేక ఇబ్బందిపడుతున్నామని యువత చెప్పడంతో అతి త్వరలోనే కాకినాడలో మెగా జాబ్ మేళా నిర్వహించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Also Read : ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారలే..అనాధలైన స్నేహితుడి పిల్లలకు అండగా..!!

Exit mobile version