Site icon Polytricks.in

వనమాకు సుప్రీంకోర్టులో ఊరట లభించిందా..?

సుప్రీంకోర్టులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావుకు ఊరట లభించింది. ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లందంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వనమా సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుపై స్టే విధించింది.

15రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. మరో నాలుగు నెలలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు వనమా ఎన్నికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ మరో నాలుగు వారాలకు వాయిదా వేయడంతో వనమా ప్రత్యర్ధి జలగం వెంకట్రావ్ నిరాశ చెందారు. ఆయన పదవి కోల్పోతే ఈ నాలుగు నెలలైనా పదవిలో కొనసాగవచ్చునని జలగం అనుకున్నారు కానీ ఆయనకు ఊరట లభించలేదు.

మరో నాలుగు నెలలో ఎన్నికలు ఉండటంతో వనమా సుప్రీంకోర్టుకు వెళ్ళరని అంత అనుకున్నారు. కానీ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే.. సిట్టింగ్ లో చాలామందికి టికెట్లు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించడంతో… ఇప్పుడు పదవిని కోల్పోతే టికెట్ రాదనే ఆలోచనతో వనమా సుప్రీంకోర్టు మెట్లను ఎక్కినట్లు సమాచారం. మరి నాలుగు వారాల అనంతరం ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.

Also Read : ఎమ్మెల్యే వనమాపై అనర్హత వేటు – హైకోర్టు సంచలన తీర్పు

Exit mobile version