Site icon Polytricks.in

ఎమ్మెల్యే వనమాపై అనర్హత వేటు – హైకోర్టు సంచలన తీర్పు

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఎన్నికల అఫిడవిట్ తప్పుగా సమర్పించారని ఆయన ప్రత్యర్ధి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ఈమేరకు తీర్పునిచ్చింది. దీంతో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా గుర్తిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు గెలుపును సవాల్ చేస్తూ జలగం 2018లోనే హైకోర్టును ఆశ్రయించారు. వనమా ఎన్నికల అఫిడవిట్ తప్పుడు తడకగా ఉందని ఫిర్యాదులో ప్రస్తావించారు. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎట్టకేలకు తుది తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేగా వనమాపై అనర్హత వేటు వేసింది.

వనమా ఎన్నికల అఫిడవిట్ తప్పుగా ఉందని చెబుతూ జలగంను ఎమ్మెల్యేగా ప్రకటించింది హైకోర్టు. తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకుగాను వనమాకు రూ .5 లక్షల జరిమానా విధించడంతో పాటు 2018 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా అర్హుడు కాదంటూ తీర్పు నిచ్చింది.

జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీబీ పాటిల్‌ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో ఆయన ప్రత్యర్ధి మదన్ మోహన్ రావు పిటిషన్ దాఖలు చేశారు. బీబీ పాటిల్ ఆయనపై ఉన్న నేరాలను అఫిడవిట్ లో పేర్కొనలేదని ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సవాల్ చేస్తూ బీబీ పాటిల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా బీబీ పాటిల్ ను అభ్యర్ధనను తోసిపుచ్చింది. దీంతో మదన్ మోహన్ పిటిషన్ పై రోజువారీ విచారణకు లైన్ క్లియర్ అయింది. బీబీ పాటిల్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు వివరాలు నమోదు చేసినట్లుగా తేలితే ఆయనను అనర్హడిగా ప్రకటించనున్నారు.

Also Read : తాళాలు పగలగొట్టండి- ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ కేసులో హైకోర్టు ఆదేశం

Exit mobile version