Site icon Polytricks.in

వినాయకుడికి నైవేద్యంగా మటన్, చికెన్- ఎక్కడో తెలుసా..?

వినాయక చవితి వేడుకలు దేశవ్యాప్తంగా భక్తిశ్రద్దలతో ఘనంగా జరుగుతున్నాయి. లంబోదరుడికి రకరకాల నైవేద్యాలను సమర్పిస్తూ భక్తులు భక్తిని చాటుకుంటున్నారు. వినాయకుడికి ఇష్టమైన మోదకాలు,లడ్డులు, కుడుములు నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఇక, గణనాథుడి నిమజ్జనం వరకు భక్తులంతా మాంసాహారాన్నికి దూరంగా ఉంటారు. కారణం.. గణపతి పూజలు చేసేవారు నాన్ వెజ్ కు దూరంగా ఉంటూ నిష్ఠతో ఉండాలనడమే. కాని వినాయకుడికి నాన్ వెజ్ తో నైవైద్యం సమర్పిస్తారని మీకు తెలుసా..?

అవును.. వినాయకుడికి మాంసాహారాన్ని నైవైద్యంగా సమర్పిస్తారు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. ఇది మరెక్కడో కాదు. భారతదేశంలోనే. ఉత్తర కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో వందల ఏళ్లుగా ఈ తంతు కొనసాగుతోంది. నాన్ వెజ్ ను వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. సావాజీ కమ్యూనిటీ ఈ విశిష్టమైన ఆచారాన్ని నిర్వహిస్తోంది. రకరకాల నాన్‌ వెజ్‌ వంటకాలను నైవేద్యంగా పెడుతుంటారు.

ఉత్తర కర్ణాటక ప్రాంత ప్రజలు శ్రావణ మాసంలో భక్తిశ్రద్దలతో ఉంటారు. నాన్ వెజ్ ను అసలే ముట్టుకోరు. శ్రావణం నుంచి గణేష్ చతుర్ధి వరకు మాంసాహారాన్ని అసలే తీసుకోరు. ఆ తరువాత నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేస్తారు. వినాయకుడికి సమర్పించే నాన్ వెజ్ నైవేద్యంలో మటన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మటన్‌ మసాలా, మటన్‌ బోటీ, మటన్‌ ఖీమాతోపాటు కొంతమంది చేపలు , చికెన్ కూడా నైవేద్యంగా సమర్పిస్తారు.

Also Read : వరుణ్ తేజ్ తోపాటు నిహారిక పెళ్లి కూడా..?

Exit mobile version