Site icon Polytricks.in

వరుణ్ తేజ్ తోపాటు నిహారిక పెళ్లి కూడా..?

ఇటీవలే విడాకులు తీసుకున్న మెగా డాటర్ నిహారిక కొణిదెల విషయంలో నాగబాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరుణ్ తేజ్ తోపాటు నిహారిక పెళ్లి కూడా చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో నాగబాబు ఉన్నారని ఫిలింసర్కిల్లో వార్త హల్చల్ చేస్తోంది.

నవంబర్ లో వరుణ్ తేజ్ వివాహం జరగనుండగా.. అప్పుడే నిహారిక పెళ్లి కూడా చేసేయాలనే తలంపుతో నాగబాబు ఉన్నట్లు టాక్. ఆయనకు తన ఇద్దరు పిల్లలంటే పంచ ప్రాణాలు. ఇద్దరినీ అన్యోన్యంగా చూసుకున్నారు. నిహారికకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయగా.. ఆమె కాపురం రెండేళ్ళపాటు కూడా కొనసాగలేకపోయింది.

చైతన్య- నిహారికల మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. దాంతో ఇప్పుడు నిహారికకు మరో పెళ్లి చేసి ఆమె లైఫ్ ను సెట్ చేయాలని నాగబాబు అనుకుంటున్నారట. ఇందులో భాగంగా వ‌రుణ్ తేజ్ పెళ్లితో పాటు నిహారిక పెళ్లి కూడా జ‌రిపించాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

ఇందుకోసం మెగా ఫ్యామిలీతో సన్నిహితంగా ఉండే ఫ్యామిలీకి చెందిన ఓ అబ్బాయిని చూశారని..అతనితో నిహారిక వివాహం జరిపించాలని నాగబాబు ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తోంది. అయితే.. నిహారిక ఇప్పుడప్పుడే వివాహం చేసుకునేందుకు ఆసక్తిగా లేదని…కొంత సమయం ఇవ్వాలని ఆమె కోరినట్లుగా చెప్తున్నారు.

Also Read : లోక్ సభ సీటా..? రాజ్యసభా..? -నాగార్జునకు వల వేస్తోన్న వైసీపీ..?

Exit mobile version