Site icon Polytricks.in

వైసీపీ ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు – ఆసుపత్రికి తరలింపు

ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారని వెల్లడించారు. ఆయన గుండెలో రెండు వాల్వులు బ్లాక్ అయినట్లు పరీక్షలలో తేలిందని వెల్లడించారు.

యాంజియో పరీక్ష పూర్తయిందని, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ప్రమాదమేమీ లేదని వైద్యులు ప్రకటించారు. అయితే, మెరుగైన వైద్యం కోసం మేకపాటిని చెన్నైకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మేకపాటి ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.

మరికాసేపట్లో ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆయనకు చికిత్స కొనసాగుతోంది.

Also Read : మేకపాటి చంద్రశేఖర్ 18ఏళ్ళు కాపురం చేశాడు- శివచరణ్ రెడ్డి తల్లి

Exit mobile version