Site icon Polytricks.in

మేకపాటి చంద్రశేఖర్ 18ఏళ్ళు కాపురం చేశాడు- శివచరణ్ రెడ్డి తల్లి

నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన తండ్రి అని శివచరణ్ రెడ్డి అనే యువకుడు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనకు ఇద్దరు కుమార్తెలు తప్ప ఎవరూ లేరని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించగా.. తాజాగా శివచరణ్ రెడ్డి తల్లి లక్ష్మిదేవి ఓ వీడియో విడుదల చేశారు.

చంద్రశేఖర్ తనతో 18 ఏళ్లు కాపురం చేశారని, తమ కుమారుడు శివచరణ్ రెడ్డిని అప్పట్లో ఆయన బాగా చూసుకునే వారని అన్నారు. తనకు 15 ఏళ్ల వయసులో కొండారెడ్డి అనే వ్యక్తితో పెళ్లయిందని కాని, రెండేళ్లకే కొండారెడ్డి తనను వదిలేసి వెళ్లిపోయాడని గుర్తు చేసుకున్నారు. దీంతో తాను తన పిన్ని ఇంటికి వచ్చానన్నారు.

అప్పుడు తన విషయం మా మామ, చంద్రశేఖర్ రెడ్డికి చెప్పారని లక్ష్మిదేవి చెప్పుకొచ్చారు. మోసం చేసిన వ్యక్తి గురించి ఎక్కువ బాధపడొద్దని.. నిన్ను చూసుకుంటానని చంద్రశేఖర్ చెప్పినట్లు చెప్పారామె. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండేళ్ళపాటు ఇంటి చుట్టూ తిరిగాడని అన్నారు. ఇప్పుడేమో డబ్బుల కోసం అబద్దాలు చెబుతున్నామని అంటున్నారని లక్ష్మిదేవి ఆవేదన వ్యక్తం చేశారు.

తనను బెంగళూరు తీసుకెళ్ళి కాపురం పెట్టాడని, కుమారుడు శివచరణ్ రెడ్డిని చక్కగా చూసుకునేవారన్నారు. ప్రస్తుతం ఆయనతోఉన్న శాంతకుమారి పరిచయం వలన తమను దూరం పెట్టాడని చెప్పారు. ఈ విషయమై చంద్రశేఖర్ ను నిలదీయడంతో తాము ఎవరో తెలియదని అంటున్నాడని చెప్పారు.

Also Read : మేకపాటి మరో కొడుకు – డీఎన్ఏ టెస్ట్ కు రెడీనా..?

Exit mobile version