Site icon Polytricks.in

వైఎస్సార్ కు నటితో రెండో పెళ్లి – సోషల్ మీడియాను ఊపేస్తోన్న వార్త..!!

పవన్ కళ్యాణ్ మూడుపెళ్ళిళ్ళ అంశాన్ని వైఎస్ జగన్ పదేపదే ప్రస్తావిస్తూ ఉండటంతో సీనియర్ జర్నలిస్ట్, జనసేన నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నాడని కానీ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విడాకులు ఇవ్వకుండానే నటిని బెదిరించి వివాహం చేసుకున్నారని బాంబ్ పేల్చారు. వైఎస్సార్ తరుచు చెన్నై వెళ్ళడానికి కారణం అక్కడ తనకు రెండో భార్య ఉండటమే కారణమని ఆరోపించారు.

వైఎస్ అంటే తనకు అమితమైన అభిమానం అని, కానీ జగన్ వ్యవహారశైలితో ఎవరికీ తెలియని ఈ చీకటి బాగోతాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నట్లు జనసేన నేత చెప్పారు. విజయమ్మకు విడాకులు ఇవ్వకుండానే నటి జయచిత్రను వైఎస్ రహస్యంగా రెండో వివాహం చేసుకున్నారన్నారన్న ఆయన…ఈ విషయం వైఎస్ కుటుంబీకులందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు.

జయచిత్రకు పెళ్లి జరిగి…కుమారుడు ఉన్నప్పటికీ ఆమెను వైఎస్ బెదిరించి వివాహం చేసుకున్నారని ఆరోపించాడు జనసేన నేత. తను చెబుతున్నవి అబద్దమైతే చెన్నైలో ఉంటున్న జయచిత్రను అసలు వాస్తవాలు అడగాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. తను కూడా ఇన్నాళ్ళు ఈ విషయం బయటపెట్టవద్దని అనుకున్నానని కానీ జగన్ తీరుతో ఈ విషయం బయట పెట్టక తప్పలేదని చెప్పారు.

వైఎస్ మరణం విషయాన్ని జగన్ మొదట జయచిత్రకే చెప్పారని… ఆయన మరణంతో పులివెందులకు వచ్చి నానా హంగామా చేస్తే చంపేస్తానని జగన్ బెదిరించినట్లు సంచలన ఆరోపణలు చేశాడు. ఈ విషయంలో తాను అబద్దం చెప్పినట్లు తేలినట్లు తేలితే దేనికైనా సిద్దమేనని అన్నారు. అలాగే జగన్ పై కూడా లైంగిక ఆరోపణలు చేశాడు. నయనతార, అనుష్కలతో జగన్ కు ఎఫైర్ ఉన్నదని అన్నారు. జనసేన నేత చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Exit mobile version