Polytricks.in

అసెంబ్లీకి వస్తారా? రారా? ఈసారి ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన కవిత

ఇకనైనా కేసీఆర్ బయటకు రాకపోతే…బీఆర్‌ఎస్ భూస్థాపితమవ్వడం ఖాయం. కేటీఆర్, హరీష్‌రావును నమ్ముకుంటే పార్టీ మూసుకొని, మూటముల్లె సర్ధుకోవాల్సిందే. ఈ మాటలన్నది ఎవరో కాదు…సాక్షాత్తూ కేసీఆర్ గారాలపట్టి కవిత. ఇప్పటికైనా కేసీఆర్ ఫామ్‌హౌజ్‌ నుంచి బయటకు రాకపోతే బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టమని మరోసారి చెప్పారు. వీరులు, శూరులు అని నమ్మి కేటీఆర్‌, హరీష్‌రావుకు పార్టీని అప్పజెప్తే…వారిద్దరూ బీఆర్ఎస్‌ను నామరూపాల్లేకుండా చేస్తున్నారని మైకుల ముందు వాపోయారు కవిత. అంతేకాదు పిల్లకుంకలతో బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణకు ఒరిగేదేమీ లేదని మీడియా చిట్‌చాట్‌లో చెప్పారు.

 

హరీష్‌రావు అనే బబుల్ షూటర్‌ వల్లనే పార్టీ సర్వనాశనం అయిపోతుందని మరోసారి ఫైరయ్యారు. మరోవైపు కేటీఆర్‌పై కూడా ఇన్‌డైరెక్ట్‌గా పంచ్‌లు వేశారు. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టమని చెప్పారు. కేసీఆర్ ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి..లేకపోతే పార్టీ భూస్థాపితమవ్వడం ఖాయమన్నారు.

ఒకవైపు హరీష్‌రావును డైరెక్ట్‌గా టార్గెట్ చేసిన కవిత…మరోవైపు బీఆర్ఎస్‌ పనై పోయిందని ఇన్‌డైరెక్ట్‌గా కేటీఆర్‌కు చురకలంటించారు. వాళ్లిద్దరికీ చేతనవ్వడం లేదు..కాబట్టి నేరుగా కేసీఆర్ వచ్చి పాలమూరు ప్రాజెక్టుపై విమర్శలకు సమాధానం ఇవ్వాలన్నారు. అంటే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ చెప్తున్నవన్నీ నిజాలు కాదని స్పష్టం అవుతున్నది. అంతేకాదు కేటీఆర్, హరీష్‌రావు చేస్తున్నవన్నీ అర్ధం, పర్థం లేని వ్యాఖ్యలే అని తేల్చి చెప్పింది.

Exit mobile version