Site icon Polytricks.in

ఆడవాళ్లే బట్టలు విప్పి పోలీసులపై దాడి – మణిపూర్ ఇష్యూపై కరాటే కళ్యాణి పోస్ట్..!!

మణిపూర్ ఘటన యావత్ దేశాన్ని కంటతడి పెట్టించింది. ఇద్దరు ఆదివాసీ స్త్రీలను నగ్నంగా ఊరేగిస్తు, వారిని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ఓ తెగకు చెందిన కొంతమంది యువకులు తీవ్రంగా అవమానించారు. అనంతరం ఆ ఇద్దరిపై అత్యాచారం చేశారు. ఈ ఘటన జరిగిన రెండు నెలల తరువాత వీడియోస్ బయటకు వచ్చాయి. ఈ ఘటనకు పాల్పడిన దుండగులను శిక్షించాలని డిమాండ్లు పెద్దఎత్తున వచ్చాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు, సినీ నటి కరాటే కళ్యాణి మణిపూర్ ఘటనపై వివాదాస్పద పోస్ట్ చేసింది. మణిపూర్ ఘటనలో అసలు నిజం తెలిసింది. ఆడవాళ్లే బట్టలు విప్పి పోలీసులపై దాడి చేశారని, ఆ ఘటన చూసి అసహ్యం వేసిందిని ఫేస్ బుక్ లో కామెంట్స్ చేసింది కరాటే కళ్యాణి. జాతీయ జెండాను తగలబెట్టిన ఘటనను ఖండిస్తూ పెట్టిన పోస్ట్ కు…అబ్బో పోడుకుచుకొని వచ్చావ్ అక్క. మొన్న మణిపూర్ లో సాటి ఆడ మనిషిని బట్టలు లేకుండా ఊరేగించినప్పుడు ఇంత రోషం పొడుచుకోరాలేదే? ఏమది కారణం? అంటూ నెటిజన్ కామెంట్ చేయడంతో పైవిధంగా రియాక్ట్ అయింది కరాటే కళ్యాణి.

భారతదేశంలో ఉంటూ తింటూ జాతీయ జెండాను తగలబెట్టిన డాష్ గాళ్లని కోసికారమ్ పెట్టాలి.. థూ మీ బతుకుచెడా అంటూ పోస్ట్ పెట్టింది కళ్యాణి. దాంతో నెటిజన్లు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మాటా మాటా పెరిగి విషయం మణిపూర్ ఘటన వైపు వెళ్ళింది. పరస్పర దూషణలు చేసుకున్నారు. కరాటే కళ్యాణి కూడా కామెంట్స్ తో రెచ్చిపోతుంది.

Also Read : హీరో నితిన్ పోలిటికల్ ఎంట్రీ – ఏ పార్టీలో చేరబోతున్నారంటే..?

Exit mobile version