Site icon Polytricks.in

ముత్తిరెడ్డికి ఇంటిపోరు – టికెట్ కోసం ముత్తిరెడ్డి వెనక మంట పెడుతున్న పల్లా..?

జనగామ బీఆర్ఎస్ టికెట్ ఫైట్ తారాస్థాయికి చేరుకుంది. పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. జనగామ నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్గం, పల్లా వర్గంగా చీలిపోయింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ జిల్లా అద్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగల సంపత్ రెడ్డి చేసిన ఫోన్ కాల్ సంబాషణ జిల్లా పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా మనమంతా పని చేయాలి. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా నడుచుకోవాలని నర్మెట జడ్పీటీసీ శ్రీనివాస్ నాయక్ తో పాగల సంపత్ ఫోన్ కాల్ లో సంభాషించారు. ఆయనపై వ్యతిరేకత ఉందని, టికెట్ ఇచ్చినా గెలవరని అనుకున్నారో కానీ జడ్పీ చైర్మన్ మాత్రం ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా పని చేయాలనీ ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. పాగల సంపత్ రెడ్డి ఎమ్మెల్సీ పల్లాకు అత్యంత సన్నిహితుడు. దాంతో పల్లానే పాగల సంపత్ తో ఇలా మాట్లాడిస్తున్నాడా..? అన్న అనుమానాలను వ్యక్తం అవుతున్నాయి.

పాగల సంపత్ కు జడ్పీ చైర్మన్ పదవి దక్కడం పల్లా ఆశీస్సులతోనే టాక్ ఉంది. ఈ కారణంతోనే వచ్చే ఎన్నికల్లో పల్లాకు టికెట్ ఇచ్చేలా మనమంతా కేసీఆర్ ను కలవాలని జడ్పీటీసీతో సంపత్ మాట్లాడడా..? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ముత్తిరెడ్డి స్థానికేతరుడు.. స్థానికుడికే టికెట్ ఇప్పించుకోవాలని కేసీఆర్ కలిసి విజ్ఞప్తి చేయాలని భావిస్తున్నారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి చెందిన పల్లాకు టికెట్ దక్కేలా పాగల సంపత్ తనదైన ప్రణాళిక రచిస్తున్నారు అనే అభిప్రాయాలూ సర్వత్ర వినిపిస్తున్నాయి.

అయితే.. ఈ ఫోన్ కాల్ సంభాషణ నిజమేనని సంపత్ స్పష్టం చేశారు. కాకపోతే ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి టికెట్ ఇవ్వొద్దని ఎక్కడ చెప్పలేదని తెలిపారు. టికెట్ ఎవరికీ వచ్చినా కలిసికట్టుగా పని చేయాలనీ మాత్రమే చెప్పినట్లు వెల్లడించారు. తాను మాట్లాడిన మాటల్లో ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా ఉన్నట్లు ఉన్న ఆడియోను బయటకు విడుదల చేశారని తెలిపారు.

Also Read : 28మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు..?

Exit mobile version