Site icon Polytricks.in

28మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు..?

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావుపై హైకోర్టు అనర్హత వేటు వేయడంతో చాలామంది నేతలకు టెన్షన్ పట్టుకుంది. తప్పుడు అఫిడవిట్లు సమర్పించడంతోపాటు పలు కారణాలను చూసి 28మంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లుబాటు కాదంటూ హైకోర్టులో వారి ప్రత్యర్ధులు పిటిషన్లు దాఖలు చేశారు.

ఇటీవల వనమా విషయంలో సంచలన తీర్పు వెలువరించిన హైకోర్టు, ఈ నెల 12నుంచి 17వరకు మిగతా పెండింగ్ పిటిషన్లపై క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో 30పిటిషన్లు పెండింగ్ లో ఉండగా అందులో 28 పిటిషన్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలపైనే ఉన్నాయి. దాంతో ఎమ్మెల్యేలకు అనర్హత వేటు టెన్షన్ పట్టుకుంది.

మరికొద్ది రోజుల్లో ఈ పిటిషన్ లు విచారణకు రానున్నాయి. దాంతో ఈ నెలఖారు చివరి వరకు ఎంతమంది ఎమ్మెల్యేలు అనర్హులుగా మారుతారోనని బీఆర్ఎస్ వర్గాల్లూ చర్చ జరుగుతోంది.

ఎవరెవరిపై పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి..?

మహబూబ్‌నగర్ :- శ్రీనివాస్ గౌడ్ వర్సెస్ చంద్రశేఖర్

వేములవాడ :- చెన్నమనేని రమేష్ బాబు వర్సెస్ ఆది శ్రీనివాస్

కొడంగల్ :- పట్నం నరేందర్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి

గద్వాల్ :- కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ డీకే అరుణ

ధర్మపురి :- కొప్పుల ఈశ్వర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్

పటాన్ చెరు :- మహిపాల్ రెడ్డి వర్సెస్ కాట శ్రీనివాస్ గౌడ్

అసిఫాబాద్ :- ఆత్రం సక్కు వర్సెస్ కోవా లక్ష్మి

ఖైరతాబాద్ :- దానం నాగేందర్ వర్సెస్ దాసోజు శ్రవణ్

మంచిర్యాల :- ప్రేమ్‌సాగర్ రావు వర్సెస్ దివాకర్ రావు

సికింద్రాబాద్ :- పద్మారావు వర్సెస్ కాసాని జ్ఞానేశ్వర్

ఇబ్రహీంపట్నం :- మంచిరెడ్డి కిషన్ రెడ్డి వర్సెస్ మల్‌రెడ్డి

తుంగతుర్తి :- గ్యాదరి కిషోర్ వర్సెస్ అద్దంకి దయాకర్

హుస్నాబాద్ :- సతీష్ వర్సెస్ చాడ వెంకటరెడ్డి

దేవరకద్ర :- ఆల వెంకటేశ్వర్ రెడ్డి వర్సెస్ పవన్ కుమార్

వరంగల్ ఈస్ట్ :- నరేందర్ వర్సెస్ రవీందర్

ఆలేరు :- గొంగడి సునీత వర్సెస్ సతీష్

జూబ్లీహిల్స్ :- మాగంటి గోపీనాథ్ వర్సెస్ విష్ణువర్ధన్ రెడ్డి

మల్కాజ్‌గిరి :- మైనంపల్లి హన్మంత్ వర్సెస్ రామచందర్ రావు

కరీంనగర్ : గంగుల కమాలకర్ వర్సెస్ బండి సంజయ్

కోదాడ :- బొల్లం మల్లయ్య వర్సెస్ ఉత్తమ్ పద్మావతి

నాగర్‌కర్నూల్ :- మర్రి జనార్ధన్ వర్సెస్ నాగం జనార్ధన్

వికారాబాద్ :- మెతుకు ఆనంద్ వర్సెస్ గడ్డం ప్రసాద్

గోషామహల్ :- రాజాసింగ్ వర్సెస్ ప్రేమ్‌సింగ్ రాథోడ్

పరిగి :- మహేశ్వర్ రెడ్డి వర్సెస్ రామ్మోహన్ రెడ్డి

నాంపల్లి :- జాఫర్ హుస్సేన్ వర్సెస్ ఫిరోజ్ ఖాన్‌

జనగాం :- ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వర్సెస్ పొన్నాల లక్ష్మయ్య

Also Read : ఆరని మణిపూర్ మంటల వెనక దాగిన దోషులు ఎవరు..?

Exit mobile version