Site icon Polytricks.in

ఆసీస్ పై టీమిండియా ఘన విజయం

బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. ఆసీస్ పై ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఈసారి భారత్ ను సొంత గడ్డపై ఓడించి తీరుతామని బీరాలు పలికిన ఆసీస్ జట్టు అన్ని రంగాల్లోనూ ఓటమిని చవిచూసింది.

భారత స్పిన్నర్లకు ధాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ పూర్తిగా చేత్తులేత్తేశారు. తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకే ఆలౌట్ అయిన ఆస్ట్రేలియాలో సెకండ్ ఇన్నింగ్స్ లో ఆ తరహ ప్రదర్శన కూడా చేయలేకపోయింది. ఆడుతున్నది ఆసీస్ జట్టేనా అని అనుమానం కల్గిలా ఆ జట్టు ప్రదర్శన కనిపించింది. మొత్తంగా మూడు రోజుల్లో మొదటి టెస్టు ముగిసింది.

మొదటి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి ఆల్ రౌండర్ జడేజా సత్తా చాటితే.. సెకండ్ ఇన్నింగ్స్ లో అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. జడేజా రెండు వికెట్లతో రాణించాడు. ఆస్ట్రేలియా ఓపెనర్లు మినహా మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ కూడా పట్టుమని 20 పరుగులు కూడా చేయలేకపోయారు. ఒక్క స్టీవ్ స్మిత్ మాత్రం అందరూ ఔట్ అవుతున్నాక్రీజ్ లో నిలదొక్కుకొని వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. స్మిత్ (25) నాటౌట్ గా మిగలగా.. మిగాతా అందరూ పెవిలియన్ కు క్యూ కట్టారు.

టెస్టు సీరిస్ కు ముందు ఆసీస్ మాజీలు ప్రస్తుత జట్టుపై ప్రశంసలు కురిపిస్తూ.. టీమిండియాను హెచ్చరించారు. అన్ని రంగాల్లో టీమిండియా కంటే ప్రస్తుత ఆసీస్ జట్టు బలంగా ఉందని.. సొంత గడ్డపై భారత్ కు ఈసారి పరాభవం తప్పదని పేర్కొన్నారు. బరిలోకి దిగాక ఆసీస్ జట్టు భారత బౌలర్ల ధాటికి కుప్పకూలింది.

ఐదు నెలల విరామం తర్వాత ఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజా అటు బ్యాట్ తో.. ఇటు బంతితో రాణించాడు. ఈ మ్యాచ్ లో మన స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తేడాతో ఘోరంగా ఓడిపోవడం విశేషం.

భారత్ బ్యాట్స్ మెన్ కూడా స్పిన్నర్ల విషయంలో తడబడినా మెరుగైన స్కోర్ చేశారు. రోహిత్ 120, జడేజా 70, అక్షర్ పటేల్ 84 పరుగులతో రాణించడంతో భారత్ 400 పరుగులకు ఆలౌట్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ జట్టు 32 .3ఓవర్లలో కేవలం 91పరుగులు చేసి ఆలౌట్ అయింది.

Also Read : రోహిత్ శర్మ కొత్త రికార్డ్

Exit mobile version