Site icon Polytricks.in

రోహిత్ శర్మ కొత్త రికార్డ్

టీమిండియా సారధి రోహిత్ శర్మ కొత్త రికార్డును నెలకొల్పాడు. దాదాపు రెండేళ్ళ తరువాత రోహిత్ సెంచరీ చేశారు. టెస్టుల్లో 9వ శతకం బాదిన రోహిత్ శర్మ ఓ అరుదైన ఫీట్ ను సాధించాడు.

బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో కెప్టెన్ రోల్ లో అతను సెంచరి బాదాడు. 2021లో ఇంగ్లండ్ పై చివరిసారిగా రోహిత్ సెంచరీ చేశారు. స్పిన్ కు అనుకూలిస్తోన్న నాగపూర్ పిచ్ పై ఒకరెనుక ఒకరు పెవిలియన్ కు క్యూ కడుతుంటే రోహిత్ ఒక్కడే సెంచరి చేశాడు.

ఆస్ట్రేలియాపై కెప్టెన్ గా తొలి సెంచరీ చేసిన రోహిత్ శర్మ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20, వన్డే, టెస్టు మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన ఏకైక భారత కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయంగా పాక్ కెప్టెన్ బాబర్ అజాం, ఫాఫ్ డుప్లెసిస్, తిరకరత్నే దిల్షాన్ మాత్రమే ఇంతకుముందు ఈ ఫీట్ సాధించారు. తాజాగా సెంచరీ చేయడంతో వారి సరసన రోహిత్ నిలిచాడు.

ప్రస్తుతం ఈ మూడు ఫార్మాట్లకు కలిపి రోహిత్ శర్మ 43 శతకాలను పూర్తి చేశాడు. ఇందులో టెస్టుల్లో 9, వన్డేల్లో 30, టీ20ల్లో నాలుగు సెంచరీలు ఉన్నాయి.

Exit mobile version