Site icon Polytricks.in

మెగా ఫ్యామిలీకి అల్లుడుగా హీరో తరుణ్..?

మెగా ఫ్యామిలీకి ఒకప్పటి స్టార్ హీరో అల్లుడు కాబోతున్నట్లు రెండు రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఆ హీరో ఎవరో కాదు. ఒకప్పుడు స్టార్ హీరోగా గుర్తింపు పొందిన తరుణ్… మెగా ఫ్యామిలీకి అల్లుడు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారం విస్తృతంగా సాగుతున్న సమయంలోనే తరుణ్ తల్లి మా వాడికి పెళ్లి జరగబోతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు..మా వాడికి బడా ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో పెళ్లి జరగబోతుందని చెప్పడం ఈ ప్రచారానికి బలం చేకూర్చుతోంది.

టాలీవుడ్ లో బడా ఫ్యామిలీలు అంటే మెగా, అక్కినేని, నందమూరి, దగ్గుబాటి కుటుంబాలు. అక్కినేని ఫ్యామిలీలో అమ్మాయిలు లేరు. దగ్గుబాటి ఫ్యామిలీలో ఒకరున్నా ఆమెకి తరుణ్ కి చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది. నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ కూతుర్లకు పెళ్లి అయింది. ఇక మిగిలింది కొణిదెల ఫ్యామిలీనే.

దాంతో తరుణ్ పెళ్లి చేసుకొబోయేది మెగా ఫ్యామిలీ నుంచె అనే ప్రచారం జరుగుతోంది. శ్రీజ తోనో లేదంటే ఇటీవల విడాకులు తీసుకున్న నిహారికతోనే తరుణ్ వివాహం జరగనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఈ వార్తలపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత రానుంది.

Also Read : 28మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు..?

Exit mobile version