Site icon Polytricks.in

వారిద్దరు కలిస్తే వైసీపీకి కడుపు మంటెందుకు..?

చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళడం వైసీపీకి అస్సలు రుచించడం లేదు. పొత్తులపై చర్చించి, వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తాయోమోనన్నది వైసీపీ ఆందోళన. ఇదే జరిగితే వైసీపీకి ఇబ్బందులు తప్పవు. అందుకే చంద్రబాబు- పవన్ కళ్యాణ్ చేతులు కలపడం వైసీపీకి నచ్చడం లేదు.

చంద్రబాబు , పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారనే విషయం మీడియా ద్వారా తెలియగానే వైసీపీ హాహాకారాలు మొదలెట్టింది. అప్పటికీ పవన్ , చంద్రబాబుల భేటీనే ముగియలేదు. అప్పుడే రచ్చ షురూ చేసేశారు. వారి భేటీ సారాంశం బయటకు చెప్పకముందే వైసీపీ నేతలు గుండెలు బాదేసుకున్నారు. వైసీపీ రాజకీయం అలాగే ఉంటుంది మరి.

ఇక, చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్ళారని తెలియగానే ఒక్కో వైసీపీ నేత దిగజారి మాట్లాడారు. సంక్రాంతికి అందరింటికి గంగిరెద్దులు వెళ్తాయని.. అలా చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళారని ట్వీట్ చేశారు. డుడు బసవన్నలా తల ఊపడానికి వెళ్లారని మరో నేత ట్వీట్ చేశారు.

మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా అదే శైలిలో స్పందించారు. సంక్రాంతి పండుగ మామూళ్ల కోసం దత్త తండ్రి వద్దకు దత్త పుత్రుడు వెళ్లారంటూ ట్వీట్ చేశారు. సంక్రాంతి ప్యాకేజీ కోసమే చంద్రబాబు ఇంటికి పవన్‌ కల్యాణ్‌ వెళ్లారని విమర్శించారు.

దాదాపు అందరూ ఒకే రకమైన ట్వీట్లు చేశారు. ఇదంతా ఐ ప్యాక్ నుంచే వచ్చాయని వారి ట్వీట్లు చూసిన వారికీ ఈజీగా అర్థం అవుతుంది. ఇక, అర్థం కాని విషయం ఏంటంటే.. వారి భేటీ ముగియక ముందే వైసీపీ లీడర్స్ గుండెలు బాదేసుకోవడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతునారు. పవన్ , చంద్రబాబు కలిసినప్పుడల్లా వైసీపీ నేతలు వారి నోటికి పని చెప్తున్నారు.

Exit mobile version