Site icon Polytricks.in

ఈ రోజునుంచి యాదాద్రి దేవస్థాన పోర్టల్‌ బంద్?

గత కొన్ని రోజులుగా యాదాద్రి దేవస్థాన వెబ్ సైట్ సాంకేతిక లోపాలతో భక్తులను ఇబ్బంది పెడుతోంది. ఆన్లైన్ సేవలలో చాలా ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం. దీనిమీద లోగడ అనేక పిర్యాదులు వచ్చాయి. మరి తెగేంత వరకు లాగకూడదు అనుకున్న యాదాద్రి దేవస్తానం పాలకమండలి ఈ లోపాలను సవరించే పని మొదలు పెట్టింది.

అందుకే పోర్టల్‌ను తిరుమల తరహాలో అభివృద్ధి చేయడానికి యాదాద్రి దేవస్థాన సంకల్పించింది. ప్రస్తుతం ఉన్న పోర్టల్‌ www.yadadritemple.telangana.gov.inలోని లోపాలను సరిదిద్దడంతో పాటు మరింత వేగవంతంగా సేవలు అందించేందుకు ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఈసీఐఎల్‌) కసరత్తు చేపట్టింది.

ఈ క్రమంలో ఏర్పడే సాంకేతిక సమస్యల దృష్ట్యా ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మంగళవారం అలయ అధికారులు ఓక ప్రకటనలో తెలిపారు. కాబట్టి భక్తులు ఆన్లైన్ మీద ఆదారపదకుండా నేరుగా యాదగిరి గుట్టకు రావాలని యాదాద్రి దేవస్థాన అధికారులు సూచించారు.

Exit mobile version