Site icon Polytricks.in

ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ధామ్ ఇక తెరువనున్నారా?

ఎన్నో రోజులుగా ముసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ధామ్ ఏప్రిల్ 25వ తేదీన భక్తుల సందర్శన కోసం తెరవనున్నట్లు ఉత్తరాఖండ్లోని టెంపుల్ అధికారులు అధికారికంగా ప్రకటించారు. భక్తులు నడకతో పాటు హెలికాప్టర్‌లో కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకోవచ్చని తెలిపారు.

కేదార్‌నాథ్ ధామ్ పోర్టల్‌ను తెరుస్తామని అధికారులు పేర్కొన్నారు. హెలికాప్టర్‌లో ప్రయాణించే యాత్రికుల టికెట్ బుకింగ్ త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఇక ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆన్‌లైన్ బుకింగ్ హక్కులను పొందింది. ఇకనుంచి భక్తులు ఆన్ లైన్ ద్వార ఆహారం బుక్ చేసుకోవచ్చు.

ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్‌మెంట్ కౌన్సిల్ మార్చిలో ఇచ్చిన సంచారం మేరకు ఇప్పటికే చార్‌ధామ్ యాత్ర కోసం మొత్తం 6.34 లక్షల మంది భక్తులు వారి పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపింది. వీరిలో కేదార్‌నాథ్ ధామ్‌కు 2.41 లక్షల మంది, బద్రీనాథ్ ధామ్‌కు 2.01 లక్షలు, యమనోత్రికి 95,107 మంది, గంగోత్రి ధామ్‌కు 96,449 మంది భక్తులు పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ నెల 25 తేదీనుంచి దర్శనం ఉంటుంది కాబట్టి ఈ సంఖ్య మరింత  పెరిగే అవకాశం ఉన్నది.

Exit mobile version