Site icon Polytricks.in

హైకమాండ్ సంచలన నిర్ణయం – టి. కాంగ్రెస్ సీనియర్లపై వేటు..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కీలక సమావేశానికి డుమ్మా కొట్టారు. టీపీసీసీ నిర్వహిస్తోన్న శిక్షణ తరగతులకు హాజరు కావాలని అధిష్టానం కోరినా ఖాతరు చేయలేదు. దీంతో సీనియర్లపై కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బుధవారం టీపీసీసీ ఆధ్వర్యంలో బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో ధరణి పోర్టల్‌పై నేతలకు అవగాహన కల్పించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఈ నెల 26నుంచి ప్రారంభించనున్న హత్ సే హత్ జోడో , ఎన్నికల నిబంధనలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీనియర్ నేతలు హాజరు కావాలని ఏఐసీసీ అద్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కోరారు. అన్ని మెల్లగా సర్దుకుంటాయని సమావేశానికి తప్పక హాజరు కావాలని సీనియర్లకు ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు. కాని సీనియర్లు అధిష్టానం మాటను లెక్క చేయలేదు.

ఈ శిక్షణ తరగతులకు భట్టి విక్రమార్క, కోదండరెడ్డి మాత్రమే హాజరయ్యారు. ఉత్తమ్‌, మధుయాష్కీ, విహెచ్, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహా, కోమటిరెడ్డి గౌర్హాజరయ్యారు. స్వయంగా జాతీయాధ్యక్షుడు ఫోన్ చేసి మరీ ఆహ్వానించిన సీనియర్లు కొంతమంది పట్టించుకోకపోవడంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజులు చూసి సీనియర్ల వైఖరిని పరిశీలించి వేటు వేసే అవకాశం కనిపిస్తోంది.

Also Read : రేవంత్ పాదయాత్రకు సీనియర్ల అడ్డుపుల్లలు

సీనియర్ల విషయంలో అధిష్టానం వేచిచూసే ధోరణిలో ఉండగా.. సీనియర్లు మాత్రం పార్టీ సస్పెన్షన్ కోరుతున్నారా..? అనే అనుమానం కల్గుతోంది. ఎందుకంటే.. సీనియర్లమైన తమను పార్టీ గెంటేసిందని సానుభూతి పొందే వ్యూహంతో సీనియర్లు ఈ కీలక సమావేశానికి డుమ్మా కొట్టేసి సస్పెన్షన్ కోరుతున్నారు..? అనే సందేశాలు వస్తున్నాయి.

Also Read : ఆ సీనియర్లు గంపగుత్తగా బీజేపీలోకి వెళ్లనున్నారా..?

Exit mobile version