Site icon Polytricks.in

ఊహ – శ్రీకాంత్ లు విడాకులు తీసుకోనున్నారా..?

సినీ ఇండస్ట్రీలో విడాకుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే సమంత- నాగ చైతన్య, ధనుష్- ఐశ్వర్య జంటలు విడిపోగా తాజాగా మరో జంట విడాకులు తీసుకునేందుకు రెడీ అయినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

హీరో శ్రీకాంత్ తన భార్య ఊహకు విడాకులు ఇచ్చేందుకు సిద్దమయ్యారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతూ ఉండటంతో ఇక కలిసి ఉండటం అసాధ్యమని భావించి విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకున్నారని నెట్టింట పుకారు షికారు చేస్తోంది.

Also Read : ఫ్యాన్స్ కు సుడిగాలి సుధీర్ గుడ్ న్యూస్..!

ఆర్ధిక సమస్యలే వీరి మధ్య గొడవలకు కారణమని, చిన్న, చిన్నగా మొదలై ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనే రేంజ్ లో మనస్పర్ధలు వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట విడాకులకు సిద్దపడిందనే ప్రచారం నమ్మశక్యంగా లేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఊహ – శ్రీకాంత్ కపుల్స్ విడాకులపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Exit mobile version