Site icon Polytricks.in

౩౦ మంది ఎమ్మెల్ల్యే లకు కేసీఆర్ పంగనామం పెట్టనున్నారా?

  కేసీఆర్  కీ ఓ మంచి అలవాటు ఉంది.

చెప్పింది చేస్తారు. చేసేది చెపుతారు.

ఒక్కసారి కమిట్ అయితే తనమాట తానే వినడు.

కానీ ఎన్నికల ముందు ఓ చెడ్డ అలవాటు కూడా ఉంది.

చెప్పింది చేయరు. చేసేది చెప్పరు.

ఇక్కసారి కమిట్ అయితే అందరి మాట వింటారు.

చివరి నిముషంలో అయన ఎటు మొగ్గుతారో, ఏం చేస్తారో ఎవ్వరికి తెలియదు. చివరికి ఆయనకు కూడా తెలియదు. అంత టాప్ సీక్రేట్.

ఈసారి సిట్టింగ్ ఎంఎల్ఏ ఎమ్మెల్యేలకు అందరికి మళ్ళి సీట్లు ఇస్తాను అని లోగడ ప్రకటించారు. దీనిని నమ్మినవాళ్ళ కంటే నమ్మని వాళ్ళే ఎక్కువా. వాళ్లు అనుమానించినట్లే జరిగింది. కేసీఆర్  రహస్యంగా జరిపించిన  సర్వే రిపోర్ట్ లు అందాయి. దానిని ఆధారం చేసుకుని ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలోంచి ౩౦ మందికి వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఇవ్వకూడదు అని గట్టిగా నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా లీక్ అయ్యింది.

అయితే ఈ విషయం కావాలని ప్రగతి భవన్ నుంచి ఆయనే లీక్ చేసినట్లు కూడా తెలిసింది. దీనివలన ఆయనకు  రెండు ప్రయోజనాలు ఉన్నాయి.

ఒకటి – సరిగ్గా పని చేయని ఎమ్మెల్యేలు ఇకనుంచి తమ తప్పులు సరిచేసుకుని పార్టీ కోసం సీరియస్ గా పని చేస్తారు.

రెండు – కేసీఆర్  ముందు తోక జాడించే  ఎమ్మెల్యేలు ఇక తోక ముడుచుకుని చెప్పింది వింటారు. ఎదురు చెప్పారు.

అందుకే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలలోంచి 40 నుంచి 45 మంది అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది కూడా కావాలని లీక్ చేసినట్లు తెలిసింది. ఆయా నియోగాక వర్గాలల్లో కింది స్టాయి నాయకులకు కేసీఆర్ పార్టీ టికెట్ ఇచ్చేందుకు ప్రజలనుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఇప్పుడు ఎవరికి వారుగా భయం గుప్పిట్లో గడుపుతున్నారు.

కానీ కొందరు కాంగ్రెస్, బిజెపిలో చేరడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. హై కమాండ్ మదిలో ఏముందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.

Exit mobile version