Polytricks.in

పాదయాత్ర ఎందుకు బండి..

తెలంగాణ బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్‌ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ఎవరి కోసం బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని సీఎల్పీ నేత భట్టి డిమాండ్ చేశారు.

పెరిగిన ధరలకు వ్యతిరేకంగా చేస్తున్నారా? మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారంలోకి రావాలని పాదయాత్ర చేస్తున్నారా? అని ప్రశ్నించారు. పేదల అకౌంట్స్‌లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పి వేయనందుకా పాదయాత్ర చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పెట్రో, డీజిల్‌ ధరలు పెంచమని పాదయాత్ర చేస్తున్నారా బండి సంజయ్..అని ప్రశ్నించారు భట్టి.

Exit mobile version