Site icon Polytricks.in

సుఖేష్ చంద్రశేఖర్ ఎవరు..? అతని బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ దర్యాప్తు సాగుతుండగా సుఖేష్ చంద్రశేఖర్ అనే ఆర్ధిక నేరగాడు చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఆప్ తరుఫున బీఆర్ఎస్ నేతలకు హైదరాబాద్ లో తాను 15కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పడంతో ఈ సుఖేష్ చంద్రశేఖర్ ఎవరు..? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటనే చర్చ విస్తృత స్థాయిలో జరుగుతోంది. ఏకంగా అతడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌ టాపిక్‌గా నిలిచాడు. అతడు ఎవరా అని ఆరా తీస్తే విస్తుపోయే విషయాలు తెలిశాయి.

సుఖేష్ నేపథ్యం :
బెంగళూర్ లోని భవానీ నగర్ కు చెందిన ఓ రబ్బరు కాంట్రాక్టర్ కుమారుడే ఈ సుఖేష్ చంద్రశేఖర్. కేవలం పదిహేడేళ్ళ వయస్సులో అతను అనేక నేరాలకు పాల్పడ్డాడు. పేరు మోసిన పారిశ్రామికవేత్తలను, సినీ తారలను బెదిరించి , మభ్యపెట్టి కోట్లాది రూపాయల వసూళ్లు చేయడం ప్రారంభించాడు. మొదటగా తనకు పెద్ద,పెద్ద రాజకీయ నేతలతో, అధికారులతో పరిచయాలు ఉన్నాయని పరిచయాలు పెంచుకొని ట్రాప్ చేసి వారిని బోల్తా కొట్టించడం సుఖేష్ చంద్రశేఖర్ స్టైల్. అంతేనా…తమిళనాడు మాజీ సీఎం జయలలిత చనిపోయాక, అన్నాడీఎంకే పార్టీ గుర్తు రెండాకులను ఇప్పిస్తానంటూ టీటీవీ దినకరన్‌తో రూ.50 కోట్లకు డీల్‌ కుదుర్చుకుని రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నా, బయట ఉన్నా వ్యాపారాన్ని మాత్రం ఆపలేదు. 2020, 21లో జైల్లో నుంచే ఫోన్లు, గొంతు మార్చే పరికరాల సాయంతో ర్యాన్‌బాక్సీ యజమాని శివీందర్‌ సింగ్‌ భార్యకు ఫోన్‌ చేసి ఆయనకు బెయిల్‌ ఇప్పిస్తానంటూ రూ.200 కోట్లు దోచుకున్నాడు.

ఆప్ తరుఫున బీఆర్ఎస్ కు 15కోట్లు :
జైల్లో నున్న సుకేష్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆప్ తరుఫున బీఆర్ఎస్ కు 15కోట్లను మూటజెప్పినట్లు ఆరోపించాడు. అంతేకాదు గతంలో ఇతను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఓ బీఆర్ఎస్ నేత ఇంట్లో గడిపెవాడని అంటున్నారు. ఆ తరువాత సరదా కోసం నోవాటెల్ కు వెళ్లి సినీ తారలతో ఎంజాయ్ చేసే వాడని సమాచారం.

జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, నోరా ఫతేహి జల్సాలు :
బెదిరింపులు , ప్రలోభాలకు గురి చేసి సంపాదించిన డబ్బుతో సుఖేష్ చంద్రశేఖర్ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, నోరా ఫతేహి వంటి సినీతారలను బుట్టలో వేసుకున్నాడు. వారికి ఖరీదైన బహుమతులను ఇచ్చి లోబరుచుకున్నాడు. అతని బాగోతం బయటపడిన తరువాత జైలుకు వెళ్ళిన అక్కడి నుంచే వ్యవహారాలను చక్కబెట్టుకున్నాడు సుఖేష్.

జైలు అధికారులకు మామూళ్ళు :
జైల్లోంచే బెదిరించి సంపాదించేందుకు వీలు కల్పించిన తిహార్‌ జైలు అధికారులకు సుఖేష్ చంద్రశేఖర్ నెలకు కోటి రూపాయల దాకా లంచంగా ఇచ్చేవాడట. తిహార్‌ జైల్లో ఉన్న సుకేశ్‌ను కలవడానికి కనీసం 12 మంది దాకా మోడళ్లు, నటీమణులు వచ్చారట. జైలు అధికారులకు భారీగా మూటజెప్పడంతో అతనిని కలిసేందుకు అతని భార్య భార్య లీనా మారియా పాల్‌ (తమిళ సినీ నటి) ఎప్పుడంటే అప్పుడు కలిసేవారట.

Also Read : లిక్కర్ స్కామ్ లో కోరి కష్టాలు తెచ్చుకున్న కవిత – కేసు నుంచి బయటపడటం కష్టమేనా..?

Exit mobile version