Site icon Polytricks.in

సమంత ఆరోగ్యం విషమించిందా..ఆమె సన్నిహితులు ఏమన్నారు..?

మయోసైటిస్ వ్యాధితో బాధపడుతోన్న సమంత ఆరోగ్యపరిస్థితి విషమించిందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆమె సోషల్ మీడియాలో రిప్లై ఇస్తుండటంతో అభిమానులు ఆందోళన చెందారు.

ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడంతోనే బాలీవుడ్ మేకర్స్ ఆమె సైన్ చేసిన ప్రాజెక్టుల నుంచి తప్పించారని వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే అసలు విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించగా ఆమె సన్నిహితులు ఈ వార్తలను కొట్టిపారేశారు.

సమంత స్ట్రాంగ్ విమెన్. విడాకుల తరువాత మానసిక వేదనకు గురయ్యారు. ఆ తరువాత ఆమెపై అనేక నిరాదర వార్తలు వచ్చినా తట్టుకొని కెరీర్ పై దృష్టి పెట్టింది. అలాంటి సమంత మయోసైటిస్ వ్యాధిని ఎదుర్కొని నిలబడటం పెద్ద కష్టమేమి కాదు.

ఆమె క్రమక్రమంగా కోలుకుంటున్నారు. గతంలో కన్నా మెరుగ్గా కనిపిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ లో జాయిన్ కూడా కాబోతుంది అంటూ సామ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు ఆమె సన్నిహితులు.

బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఆమె క్యాన్సిల్ చేసుకుందని వార్తలను నిరాధారమని చెప్పినట్లు తెలుస్తోంది. ఆమె సైన్ చేసిన ప్రాజెక్టులను కంప్లీట్ చేసేందుకు సమంత ఆతృతగా వెయిట్ చేస్తున్నారని ఆమె సన్నిహితులు పేర్కొన్నారు. త్వరలో సమంత ఖుషి చిత్ర షూటింగ్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఇన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి తాజా సమాచారంతో చెక్ పడింది.

Exit mobile version