Site icon Polytricks.in

‘వినరో భాగ్యము విష్ణు కథ’ రివ్యూ

‘రాజా వారు రాణి వారు’ అనే సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం తనదైన సినిమాలతో టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. మొదటి సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయినా తరువాతి చిత్రమైన “SR కళ్యాణ్ మండపం” తో సూపర్ హిట్ ను అందుకున్నాడు. అదే ఊపును కంటిన్యూ చేయాలని సెబాస్టియన్ చేసినా ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తరువాత సమ్మతమే అనే చిత్రంతో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో ‘వినరో భాగ్యము విష్ణు కథ’తో ముందుకు వచ్చాడు. ఈ సినిమా విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ : 
ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం( విష్ణు) ఓ అనాధ. చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాధాశ్రమంలో ఉంటూ పెద్దయ్యాక ఓ గ్రంథాలయంలో పని చేస్తూ ఉంటాడు. తను ఏం చేసినా నలుగురికి ఉపయోగపడాలనేది విష్ణు మనస్తత్వం. అలాంటి మంచి మనస్సున్న విష్ణుకు రాంగ్ కాల్ తో దర్శన ( కాశ్మీరీ పరదేశి) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అలాగే శర్మ (మురళీ శర్మ) అనే వ్యక్తి తోనూ రాంగ్ కాల్ ద్వారా కనెక్ట్ అయ్యి పరిచయం పెంచుకుంటుంది. వీల్లదరితో కలిసి వీడియోలు చేసి ఫేమస్ అయిపోవాలని అనుకుంటుంది దర్శన. ఈ నేపథ్యంలోనే విష్ణుతో దర్శన ప్రేమలో పడుతుంది. అయితే.. ఎన్ని ఆసక్తికరమైన వీడియోస్ అప్లోడ్ చేసినా వ్యూస్ రావడం లేదని బాధపడుతుంది దర్శన. ఇందుకోసం ఓ మర్డర్ ప్రాంక్ చేయాలనుకుంటుంది. కానీ అనుకోకుండా ఆ ప్రాంక్ కాస్త నిజమై శర్మని మర్డర్ చేస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్శనను అరెస్ట్ చేస్తారు. దర్షణకు మర్డర్ తో ఎలాంటి సంబంధం లేదని.. కావాలని దర్శనను ఇరికించారని చెప్పేందుకు విష్ణు ఏం చేస్తాడు..? అతడు ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటాడు అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ : చాలావరకు హీరోలంతా ఒకే కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తున్నారు. కథ ఎంపికలో కొత్తదనం చూపించడం లేదు. అవే ఫ్యాక్షన్ సినిమాలు, అవే ఎలివేషన్ సినిమాలు తప్ప కొత్త కథ చేసేందుకు మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఆసక్తి చూపడం లేదు. కానీ కిరణ్ అబ్బవరం మాత్రం ప్రతిసారి కొత్త కథతోనే వస్తున్నాడు. దర్శకుడు మురళి కిషోర్ ను మెచ్చుకోవాలి. ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్స్ కలగలిసిన ఈ సినిమాను ప్రేక్షకుల మనస్సును హత్తుకునేలా రూపొందించాడు.

ఫస్ట్ ఆఫ్ అంత కామెడితో ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమా కథ సాగుతుంది. ప్రధానంగా హీరోయిన్ మరియు మురళీ శర్మ యూట్యూబ్ లో అప్లోడ్ చెయ్యడం కోసం చేసే వీడియోలు కడుపుబ్బా నవ్విస్తుంది. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్ మైండ్ ని బ్లాక్ అయ్యేలా చేస్తుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం కామెడి తగ్గినట్లు అనిపించినా ఫ్రీ క్లైమాక్స్ లో వచ్చే మరో ట్విస్ట్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది.

కిరణ్ అబ్బవరం ఈ సినిమా ద్వారా మరో మెట్టు ఎక్కినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా కామెడి టైమింగ్, హీరోయిజం చూపించడంలో తనదైన మార్క్ చూపించాడు. హీరోయిన్ కూడా అద్భుతంగా నటించి ఆడియన్స్ చేత ఫుల్ మార్క్స్ వేయించుకుంటుంది. ఇక మురళీ శర్మ అయితే ఈ సినిమా లో తన నట విశ్వరూపం చూపించేసాడు.

రేటింగ్ : 2.75 /5

Exit mobile version