Site icon Polytricks.in

ఈటలకు అంత సీన్ లేదు – రాములమ్మ ట్వీట్ అంతరార్ధం ఇదేనా..!

బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ అద్యక్ష పదవి నుంచి తప్పిస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో ఆయన పదవి కాలం ముగియనుండటంతో కేంద్ర క్యాబినెట్ లోకి బండిని తీసుకొని.. ఆయన స్థానంలో ఈటలకు ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తారని కాషాయ పార్టీ అనుకూల పత్రికల్లో కథనాలు వచ్చాయి. కొంతమంది నేతలు బండి సంజయ్ ను తప్పించే అవకాశం లేదని.. ఆయన సారధ్యంలోనే ఎన్నికలకు వెళ్లాలని కేంద్ర నాయకత్వం అనుకుంటుందని చెప్తున్నారు. కాని రాష్ట్ర స్థాయిలో మాత్రం అద్యక్ష మార్పు ఉంటుందని ఆ పార్టీ వర్గాలే ప్రచారాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయి.

తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు ఉన్నమాట వాస్తవమే. బండి సంజయ్, ఈటల, కిషన్ రెడ్డి వర్గాలు ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. పార్టీలో ప్రాధాన్యత లేని వారంతా ఈటల అండ్ కిషన్ రెడ్డిల గ్రూప్ నేతలుగా చెలామణి అవుతున్నారు. కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తితో బీజేపీలో చేరిన విజయశాంతికి కాషాయ క్యాంప్ లోనూ అనుకున్న ప్రియార్టి దక్కడం లేదు. బండి సంజయ్ ఆమెను అస్సలు పట్టించుకోలేదు. దీంతో ఆమె ఈటలకు ప్రధాన మద్దతుగా నిలిచింది. ఇది కూడా రాములమ్మకు బండి సంజయ్ ప్రియార్టి కల్పించకపోవడానికి ఓ కారణంగా తెలుస్తోంది.

ఇటీవల పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ..రేవంత్ నాయకత్వం బాగుందనేలా విజయశాంతి ట్వీట్ చేశారు. ఇది తెలంగాణ బీజేపీలో హాట్ టాపిక్ అయింది. మళ్ళీ ఆమె కాంగ్రెస్ లో చేరుతారా అన్న అనుమానాలు కల్గించింది. ఆ తరువాత ఎం జరిగిందో ఏమో కాని, బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ తాజాగా ట్వీట్ చేశారు. విజయశాంతి చేసిన ఈ పోస్ట్ ఈటల వర్గాన్ని తీవ్రంగా నిరాశపరిచేలా ఉంది. ఎందుకంటే.. ఫిబ్రవరిలో బండి సంజయ్ పదవి కాలం ముగియనుందని ఆ తరువాత అద్యక్ష బాధ్యతలను ఈటలకు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోన్న సమయలో.. బండి సంజయ్ ను అద్యక్ష బాధ్యతల నుంచి తప్పించే అవకాశం లేదని రాములమ్మ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

ఇన్నాళ్ళు సంజయ్ నాయకత్వంపై అసంతృప్తిగానున్న రాములమ్మ తాజాగా ఆయన నాయకత్వంలోనే ఎన్నికలకు వెళతామంటూ ట్వీట్ చేశారు. ఇదంతా ఈటల వర్గం చేస్తోన్న ప్రచారాన్ని ఖండించేందుకు విజయశాంతి ట్వీట్ చేసి ఉంటారని పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. అయితే.. బండి సంజయ్ పై అసంతృప్తిగానున్న రాములమ్మకు ఎలాంటి హామీ ఇచ్చి బుజ్జగించారని పార్టీలో చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉండగా.. బీజేపీలో చేరాక ఈటలకు ఏదీ కలిసి రావడం లేదు. సన్నిహిత నేతలని భావించిన వారే ఇప్పుడు ఆయనను దూరం పెట్టేస్తున్నారు. వివేక్ , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలతోపాటు విజయశాంతి కూడా ఆయనతోనున్న సాన్నిహిత్యాన్ని తెగదెంపులు చేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని ఈటల బాధపడినట్లు సమాచారం.

Also Read : 10 కోట్ల పంచాయితీ – ఈటలపై హైకమాండ్ సీరియస్

Exit mobile version