Site icon Polytricks.in

మూడు పెళ్ళిళ్ళపై అన్ స్టాపబుల్ లో పవన్ కళ్యాణ్ ఫుల్ క్లారిటీ

ఓటీటీలో వస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షో విత్ బాలకృష్ణ సెకండ్ సీజన్ ప్రతిష్టాత్మక ఎపిసోడ్ కంప్లీట్ అయింది. పవన్ కళ్యాణ్ ఈ షో కి గెస్ట్ రావడంతో ఈ ఎపిసోడ్ పై అందరి దృష్టి నెలకొంది. ఈ ఎపిసోడ్ లో పవన్ ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుగుతారని పవన్ అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల అంశం గురించి ప్రస్తావిస్తారా..? అనే చర్చ జరుగుతోంది. అయితే, తనను ఇబ్బంది పెట్టె ప్రశ్నలేవి అడగొద్దని బాలయ్య వద్ద పవన్ ప్రామిస్ తీసుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. కాని అదంతా అబద్దమని తేలిపోయింది.

Also Read : అషూ , ఆర్జీవీల బోల్డ్ ఇంటర్వ్యూ – సె* 10నిమిషాల్లో చేసేస్తారంటూ..!

ఈ షో లో పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి కూడా అడిగేశారు బాలకృష్ణ. అసలు ఈ పెళ్లి సమస్య ఏంటయ్యా అని పవన్ ను ప్రశ్నించారు. అందుకు పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ గా సమాధానం ఇచ్చారు. తన జీవితంలో అసలేం జరిగిందో పూసగుచ్చినట్లు వివరించారు. రాజకీయాల్లో పెళ్ళిళ్ళ అంశాన్ని ప్రస్తావిస్తూ తనను ఇరుకున పెడుతున్నారని అనుకున్నారో ఏమోకాని పవన్ కళ్యాణ్ మ్యారేజ్ మ్యాటర్ ను కంప్లీట్ గా వివరించినట్లు కనిపించింది. ఎక్కడ ఎలాంటి దాపరికం లేకుండా క్లియర్ గా చెప్పేశాడు. పవన్ అన్సర్ తరువాత బాలకృష్ణ కూడా ఇంత క్లారిటీగా చెప్పాక కూడా ఎవరైనా పవన్ కళ్యాణ్ ను పర్సనల్ గా టార్గెట్ చేస్తే వాళ్ళు కుక్కలతో సమానం అంటూ వ్యాఖ్యానించారు.

Also Read : మహేష్ బాబుతో నమ్రతకు గొడవలు – పిల్లలే కారణమా..?

పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయాలనుకున్న ప్రతిసారి వైసీపీ నేతలు పెళ్ళిళ్ళ అంశాన్ని ప్రస్తావిస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు ఏపీ సిఎం జగన్ కూడా ఇదే విషయాన్ని పదేపదే మాట్లాడుతుంటారు. పవన్ లాగా తాను మూడు పెళ్ళిళ్ళు చేసుకోలేదని.. ఆ భార్య కాకపోతే ఈ భార్య అన్నట్టు తన ఆలోచన ఉండదని కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. బాలకృష్ణ షో తరువాత వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై స్పందించాలంటే మరోసారి పెళ్ళిళ్ళ ప్రస్తావనే తీసుకొస్తారా..?లేదా చూడాలి.

Exit mobile version