Site icon Polytricks.in

అన్ స్టాప‌బుల్ షో వీడియో: బాలయ్య ప్రశ్నలకు పవన్ సూపర్ అన్సర్స్

అన్ స్టాప‌బుల్ ఇంట‌ర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానాలు చెప్తారో తెలుసుకుందామని ఫ్యాన్స్ లో, ఇండస్ట్రీలో ఒకరకమైన ఆతృత కనిపిస్తోంది.

ఈ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. తాజాగా టీజర్ ను విడుదల చేశారు. ఇందులో రాజకీయ పరమైన ప్రశ్నలే ఎక్కువ ఉన్నాయి.

అంద‌రి హీరోల్నీ న‌న్ను బాలా అని పిల‌వండి అని బాల‌య్య అడ‌గ‌డం మామూలే. ఈసారి కూడా ప‌వ‌న్‌ని అలానే అడిగాడు. నేను ఓడిపోవ‌డానికి సిద్ధం కానీ.. మిమ్మ‌ల్ని మాత్రం అలా పిల‌వ‌లేనని ప‌వ‌న్ న‌వ్వేస్తే, ఈ పాలిటిక్సే వ‌ద్దు అంటూ బాల‌య్య కౌంట‌ర్ వేశాడు.

ఈమ‌ధ్య నీ విమ‌ర్శ‌ల్లో వాడీ వేడీ డ‌బుల్ ఇంపాక్ట్ లో క‌నిపిస్తోంది.. అని బాల‌య్య అంటే.. చాలా ప‌ద్ధ‌తిగానే మాట్లాడుతున్నానండీ అంటూ ప‌వ‌న్ చెప్పిన స‌మాధానం ఆక‌ట్టుకొంటోంది.

మెగాస్టార్ నుంచి నేర్చుకోవాల‌నుకొన్న‌వీ.. వ‌ద్ద‌నుకొన్న‌వీ.. ఏమిటి” అని బాల‌య్య అడిగినప్పుడు ప‌వ‌న్ ఉద్వేగ‌భ‌రిత‌మైన స‌మాధానం ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది.

ఇదే సమయంలో వదినతో తనకున్న అనుబంధాన్ని పవన్ గుర్తు చేసుకున్నట్లు టీజర్ లో హైలెట్ చేసి చూపించారు. మరో కీలకమైన ప్రశ్నను అడిగారు బాలయ్య.

అభిమానాన్ని ఓట్లుగా మ‌ల‌చుకోవ‌డంలో ఎందుకు విఫ‌ల‌మ‌య్యార‌న్న ప్రశ్న సంధించాడు బాల‌య్య‌. మ‌రి దానికి ప‌వ‌న్ ఎలాంటి స‌మాధానం ఇచ్చాడో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ బ‌య‌ట‌కు రావాలి.

Exit mobile version