తుమ్మల నాగేశ్వరరావును టీఆరెఎస్ లో ఒంటరి చేస్తున్నారు. పార్టీలో ఆయనకు సరైన ప్రాధాన్యత లభించడం లేదు. పార్టీ నేతలే తుమ్మల నాగేశ్వరరావును అవమానిస్తున్నారు. ఆయన హాజరయ్యే సభలకు తాము రామని బహిరంగంగా చెప్పేస్తున్నారు సొంత పార్టీ నేతలు. ఇంతా జరుగుతున్నా టీఆరెఎస్ అధిష్టానం చోద్యం చూస్తోంది. పిలిచి నేతల మధ్య సమన్వయం కుదర్చడం లేదు.
వరంగల్ జిల్లాకు చెందిన రవి చంద్ర, పార్థ సారథి లకు టీఆరెఎస్ అధిష్టానం రాజ్యసభ పదవులను కట్టబెట్టింది. తమకు లభించిన పదవుల కారణంగా సన్మాన సభలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సభకు హాజరు కావాలంటూ జిల్లా నేతలకు, ముఖ్య నేతలకు ఆహ్వానం పంపారు. తుమ్మలకు మాత్రం ఆహ్వానం పంపలేదు.దీంతో పార్టీలో తనను అంటరాని వాడ్నిగా ట్రీట్ చేస్తున్నారని ఆయన ఫీల్ అవుతున్నారు. పార్టీ వీడుతున్నాననే తనను దూరం పెడుతున్నారుని అంచనా వేసి…ఇటీవల సమావేశం నిర్వహించి పార్టీ మార్పు వార్తలకు తుమ్మల నాగేశ్వరరావు తెరదించారు. టీఆరెఎస్ ను వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో టీఆరెఎస్ టికెట్ పై పోటీ చేయాలని తుమ్మల టార్గెట్ గా పెట్టుకున్నారు. సిట్టింగ్ లకు టికెట్ ఇస్తామని కేసీఆర్ ప్రకటించడంతో తుమ్మలకు అవకాశం లేనట్లే. పాలేరు నుంచి కందాల ఉపేందర్ రెడ్డి మరోసారి పోటీ చేయనున్నారు. మరో నియోజకవర్గం నుంచి తుమ్మల కు సర్దుబాటు చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే కమ్యూనిస్టులకు ఖమ్మం నుంచి టికెట్లు ఇవ్వాలి కాబట్టి ఎటు చూసినా తుమ్మలకు టీఆరెఎస్ టికెట్ కష్టమే. దాంతో ఆయన్ను పట్టించుకోవడంలేదు. ఈ నేపథ్యంలోనే తుమ్మల అవమానాలను భరిస్తూ టీఆరెఎస్ లో కొనసాగాలని అనుకున్నా…ఆ పార్టీ నేతలు ఉండనిచ్చెలా లేరని తెలుస్తోంది.
తుమ్మలకు పొమ్మనకుండా పొగ బెడుతున్న టీఆరెఎస్
