Site icon Polytricks.in

నీ తెలివికో దండంరా బాబు – అడ్డంగా దొరికిన బండి సంజయ్

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని వ్యాఖ్యానించి నవ్వులపాలైన జలీల్ ఖాన్ తరహాలో బండి సంజయ్ కూడా ఓ ప్రశ్నకు సమాధానమిచ్చి అడ్డంగా బుక్ అయ్యాడు. ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బండి సంజయ్ తన తండ్రి ఉద్యోగం గురించి చెబుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్‌ అవుతున్నాయి.

ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు బండి సంజయ్ ఓపికగా సమాధానం చెప్పారు. తెలంగాణ ఆర్ధిక స్థితిగతులు, బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలపై వివరించారు. గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనేనని వ్యాఖ్యానించారు. కేంద్రం తెలంగాణకు చేయూతనిస్తోన్న కేసీఆర్ తన వైఫల్యాన్ని కేంద్రంపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇదంతా బాగానే ఉంది కానీ తన బ్యాక్ గ్రౌండ్ గురించి చెబుతూ సంజయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇంటర్వ్యూలో భాగంగా మీ నాన్నగారు ఏం చేస్తుంటారని బండి సంజుయ్ ను యాంకర్ ప్రశ్నించారు. రిటైర్డ్‌ టీచర్‌ అని అంటూనే ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేశాడని పొంతన లేని సమాధానం చెప్పారు. ఆయన చెప్పిన జవాబు విని యాంకర్ షాక్ అయ్యారు.

రిటైర్డ్‌ టీచర్‌ అంటున్నారు.. ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అంటున్నారు…అదెలా అండి అని ప్రశ్నించగానే తడుముకున్న సంజయ్‌ ఆ రెండు సమాధానాలను కవర్‌ చేసేలా మరో సమాధానం చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగం అండీ అని సమాధానం చెప్పారు. బండి సంజయ్ అజ్ఞానాన్ని ఏమనాలో అర్థంకాని యాంకర్‌.. ఆ టాపిక్‌ వదిలేసి మరో అంశంపై ప్రశ్నలు వేయడం ప్రారంభించారు.

సంజయ్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. ఇంతటి అజ్ఞానుడిని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడిగా నియమించడం ఏంటి సామి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను పోస్టు చేసిన వారు ప్రధాన మంత్రి అజ్ఞానుల గురించి పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాన్ని జోడించి మరింత రక్తికట్టించారు.

Also Read : బండి సంజయ్ కి కేటీఆర్ షాక్ – ధర్మపురి అరవింద్ కు గాలం…?

Exit mobile version