Site icon Polytricks.in

ముసలోళ్లతో శృతి హసన్ సరసాలా..!

హీరోయిన్ శృతి హసన్ పై గట్టిగానే ట్రోల్స్ జరుగుతున్నాయి. డబ్బుల కోసం తండ్రి వయస్సున్న హీరోలతో ఆడిపాడేందుకు సిగ్గు లేదా అంటూ సోషల్ మీడియా వేదికగా శృతి హసన్ పై దాడి జరుగుతోంది.

కొన్నాళ్ళు ఈ ట్రోల్స్ ను చూసి చూడనట్టు వదిలేసిన ఈ బ్యూటీ తాజాగా ఘాటుగా సమాధానం ఇచ్చింది. సినీ ఇండస్ట్రీలో వయస్సు అనేది కేవలం నెంబర్ మాత్రమే. గతంలో నాకంటే చాలామంది హీరోయిన్స్ సీనియర్ హీరోలతో నటించారు. అప్పుడు జరగని ట్రోలింగ్ ఇప్పుడెందుకు జరుగుతుందని ప్రశ్నించింది శృతి హసన్.

బాలయ్య, మెగాస్టార్ చిరంజీవిలతో కలిసి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది శృతి హసన్. చిరంజీవి, బాలకృష్ణల వయసు ఆమె వయసుకు డబుల్ ఉంటుంది. దీంతో ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు. డబ్బుల కోసం మీ డాడి వయస్సున వారితో స్టెప్పులేస్తావా అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. శృతి హసన్ తండ్రి కమల్ హసన్ మెగాస్టార్ చిరు, బాలయ్య ఏజ్ తో సమానమైన వ్యక్తే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ శృతిని ట్రోల్ చేశారు.

అయితే, ఆమె సీనియర్లతో నటించేందుకు మొహమాటపడకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. ఇందుకు కారణం.. ఆమెకు సినిమా ఆఫర్లు తగ్గుముఖం పట్టడమే. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు లవ్ ఎఫైర్ కారణంగా వచ్చిన ఆఫర్లను కాలదన్నింది. ఇప్పుడేమో ఆఫర్లు కోసం వెతుకుంటున్నా నిర్మాతలు, దర్శకులు, స్టార్ హీరోలు ఆమెను పెద్దగా పట్టించుకొనే పరిస్థితి లేదు.

సలార్ మూవీలో శృతి హసన్ కు ఆఫర్ రావడం నిజంగా అదృష్టమే. ఎవరూ పెద్దగా పట్టించుకోని శ్రుతికి ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. ఇక, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు విజయం సాధిస్తే ఆమెకు భవిష్యత్ ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.

Also Read : రెండో పెళ్లిపై నటి ప్రగతి క్లారిటీ

Exit mobile version