Site icon Polytricks.in

భారత్ జోడో యాత్రలో విషాదం – గుండెపోటుతో ఎంపీ మృతి

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో విషాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్  సింగ్ చౌదరి గుండెపోటుతో కన్నుమూశారు.

పంజాబ్ లోని ఫైల్లౌర్ ప్రాంతలో శనివారం ఉదయం భారత్ యత్రలో సంతోఖ్ సింగ్ పాల్గొన్నారు. ఈ యాత్ర కొనసాగుతుండగా సంతోఖ్  సింగ్ కు హార్ట్ ఎటాక్ వచ్చి కుప్పకూలిపోయారు. దాంతో వెంటనే ఆయన్ను పగ్వారాలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు.

పగ్వారాలోని ఆసుపత్రికి రాహుల్ గాంధీ కూడా వెళ్ళారు. ఆయన మరణించారని తెలుసుకొని భారత్ జోడో యాత్రను నిలిపివేశారు. సంతోఖ్ సింగ్ మరణం పార్టీకి తీరని లోటని.. ఓ గొప్ప నేతను దేశం కోల్పోయిందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇకపోతే సంతోఖ్  సింగ్ 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జలంధర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి వరుసగా రెండు సార్లు విజయం సాధించారు.

సంతోఖ్  సింగ్ మరణంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. సంతోఖ్ సింగ్ మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఆయన మరణ వార్తతో షాక్ కు గురయ్యానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

Exit mobile version