Site icon Polytricks.in

రాహుల్ గాంధీ లోక్ సభ అనర్హత వేటు పడే అవకాశం లేదు?

రాహుల్ గాంధీ లోక్ సభ అనర్హత వేటు పడే అవకాశం దాదాపు లేనట్లేనని తలలు పండిన సీనియర్ లాయర్లు చెపుతున్నారు. ఎందుకంటే ఈ కేసు శరద్ పవార్ కు చెందిన ఎన్సీపీ పార్టీ ఎంపీగా ఐన పి.పి. మహమ్మద్ ఫైజల్ కేసుకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి.

పి.పి. మహమ్మద్ ఫైజల్ 2014 – 2019 ఎన్నికల్లో లక్షద్వీప్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. అయితే 2009లో జరిగిన ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ నాయకుడిపై దాడి చేశారన్న ఆరోపణలపై అతనిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసు తీర్పు ఈ ఏడాది జనవరిలో కవరత్తీ సెషన్స్ కోర్టు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లుగా లోక్ సభ సచివాలయం జనవరి 13న ఒక ప్రకటన విడుదల చేసి ఖాళీగా ఉన్న లోక్ సభ నియోజకవర్గాల్లో లక్షద్వీప్ ను ప్రకటించింది. ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ద్వారా నోటిఫికేషన్ విడుదలైంది.

అయన వెంటనే సెషన్స్ కోర్టు తీర్పు వెలువడినంతనే ఫైజల్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు తీర్పును సవాలు చేశారు. అయితే ఎవ్వరు ఉహించి విధంగా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ హైకోర్టు స్టే ఇచ్చింది. అంతేకాదు స్టే కారణంగా ఆయనపై అనర్హత వేటు కూడా వర్తించదని కూడా స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసిన ‘న్యాయస్థానం దేశ ఖజానాకు భారమయ్యే ఉప ఎన్నికను నివారించేందుకు ఇలా చేయటం అవసరమని’ పేర్కొంది.
కాబట్టి పై కోర్టుకు వెళ్ళడానికి సూరత్ కోర్ట్ రాహుల్ గాంధీ కి ౩౦ రోజులు గడువు ఇచ్చింది. కాబట్టి ఈ తీర్పుతూ సవాలు చేస్తూ రాహుల్ గాంధీ తరపు న్యాయవాదులు సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి మహమ్మద్ ఫైజల్ కేసు లో వచ్చిన  తీర్పే రాహుల్ గాంధీ కేసులో కూడా  వచ్చే అవకాశం ఉన్నదని సీనియర్ లాయర్లు భరోసా ఇస్తున్నారు.

Exit mobile version