Site icon Polytricks.in

వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో మొదలైన కదలిక?

దేశంలోనే సంచలనం రేపిన కాకతీయ వైద్య కళాశాల (కె ఎం సి) పిజి వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో తగిన చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖా. ఇందులో మొదటి అడుగుగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న కాకతీయ వైద్య కళాశాలలోని అనస్తిశియ విభాగం అధిపతి ప్రోఫేసర్ కె. నాగర్గున రెడ్డి ని బదిలీ చేసింది. ఆయనను భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల అనస్తిశియ విభాగం అధిపతిగా పంపింది. ఈ మేరకు ఆరోగ్య శాఖా కార్యదర్శి రిజ్వీ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు.

ప్రీతి సీనియర్ వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఇది ఆత్మహత్యా, హత్యా అనే నిజం బయటికి రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు రాజకీయ నాయకులు ఎవరికి వారుగా తమ వంతు కుట్రలు పన్నుతున్నారు. ఇక ప్రభుత్వం ఏం చేసుతోందో చూడాలి.

ప్రీతి కేసు మొదటినుంచి ఎన్నో మలుపు తిరుగుతోంది. ఆమె సొంతంగా ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుందని కాకతీయ వైద్య కళాశాలలోని అనస్తిశియ విభాగం అధిపతి ప్రోఫేసర్ కె. నాగర్గున రెడ్డి ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత ఆమె సైఫ్ అనే పిజి విద్యార్ధిని ప్రేమించింది, ఆ ప్రేమ వికటించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది అనే వాదనలు తెరమీదికి వచ్చయి. ఆ తర్వాత సైఫ్ ఆమెను హింసించి చంపాడు అనే వాదనలు కూడా బలంగానే వినిపించాయి.

పి జి చదువుతున్న తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అది కచ్చితంగా హత్య అని ఆమె తండ్రి వాదిస్తున్నారు.

ఈ కేసుకు తనకు ఎలాంటి సంబధం లేకపోయినా బండి సంజయ్ ప్రీతి కేసుకు రాజకీయరంగు పులిమారు. సైఫ్ అనే పిజి విద్యార్ధి వల్లే ఇది ‘లవ్ జిహాద్’ వల్లే జరిగిందని ప్రకటించి సంచలనం రేపారు. నిజానికి తన కొడుకు బండి భగిరథ్ లోగడ ఓ ర్యాగింగ్ కేసుకో నిందితుడు. అసలు కాలేజీలల్లో ర్యాగింగ్ బూతం లేదని చెప్పడమే అతని ప్రధాన ఉద్దేశం. ఈ కేసుని మతం రాజకీయం చేసి  తిప్పి తిప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేసి కేసుని పక్కదారి పట్టించారు. దీనితో పోలీసులు రకరకాల కోణాల్లో కేసుని దర్యాప్తు చేసి, అనేక మలుపులు తిప్పారు. ఇంకా ఇన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Exit mobile version