Site icon Polytricks.in

వాళ్ళు మనపై విషాన్ని చిమ్మారు – తారకరత్న భార్య పోస్ట్ వైరల్

తారకరత్న మరణించి నెల రోజులు పూర్తి అవుతున్నా ఆయన సతీమణి అలేఖ్య రెడ్డి ఆ విషాదం నుంచి బయటపడలేకపోతుంది. ప్రతి రోజు తారకరత్నను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. తాజాగా ఆమె మరో పోస్ట్ పెట్టారు.ఇప్పుడీ పోస్ట్ వైరల్ అవుతోంది.

అలేఖ్య రెడ్డిని లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న తారకరత్నను కుటుంబ సభ్యులు దూరం పెట్టారని కథనాలు వచ్చాయి. కుటుంబమే తారకరత్నను దూరం పెట్టడంతో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అండగా నిలిచారని తారకరత్న పలు సమయాల్లో బయటపెట్టారు. గుండెపోటుతో తారకరత్న ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలోనూ బాలకృష్ణ అక్కడే ఉన్నాడు. తారకరత్నను బతికించుకునెందుకు చాలా ప్రయత్నాలు చేశాడు.

తారకరత్న మరణించిన తరువాత అలేఖ్య కుటుంబానికి తాము అండగా ఉంటామని బాలకృష్ణ హామీ ఇచ్చారు. పిల్లల చదువు బాధ్యత కూడా తాను తీసుకుంటానని చెప్పారు. అలేఖ్యరెడ్డికి నందమూరి ఫ్యామిలీ నుంచి మద్దతు వస్తున్నా ఆమె సోషల్ మీడియాలో తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

‘తారక్.. నువ్వు మమ్మల్ని విడిచి నెలరోజులు అయింది. నీ మెమోరీస్ ఇంకా కళ్లముందు మెదలాడుతూనే ఉన్నాయి. మనం కలిసి జీవిస్తామా? అని అనుకున్న నాకు నువ్వే ధైర్యం చెప్పావు. నీవిచ్చిన ధైర్యంతోనే కొత్త జీవితాన్ని ప్రారంభించాం. అయితే మొదట్లో ఎంతో వివక్షను ఎదుర్కొన్నాం.. జీవితం ముందుకు సాగడానికి ఎంతో పోరాటం చేశాం.. నిష్కమ్మ జన్మించిన తరువాత మన జీవితమే మారిపోయింది. సంతోషం రెట్టింపు అయింది. కానీ బాధలు అలాగే మిగిలాయి. ఈ సమయంలో మనపై విషాన్ని చిమ్ముతున్నా కళ్లకు గంతలుకట్టుకొని బతికాం.. మనకు పెద్ద కుటుంబం కావాలని కోరుకున్నావ్. కానీ మన బాధను అర్థం చేసుకునే వాళ్లు లేరు..’అంటూ పోస్టు పెట్టారు.

తారకరత్న కుటుంబాన్ని వివక్షకు ఎవరు గురి చేశారన్నది సోషల్ మీడియాలో బిగ్ డిబేట్ గా మారింది.

Also Read : తారకరత్న భార్యకు ఇదివరకే పెళ్లి అయిందా..?

Exit mobile version