Site icon Polytricks.in

తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?

బెంగ‌ళూరులోని నారాయ‌ణ హృద‌యాల‌య‌లో నంద‌మూరి తార‌క‌ర‌త్న‌కు వెంటిలేట‌ర్ పై చికిత్స కొన‌సాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు మంగళవారం మాత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేయలేదు. ఇప్పటికీ తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రాకపోవడం కుటుంబ సభ్యులను వేదనకు గురి చేస్తోంది.

ఆయనకు మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండటంతోనే.. మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేయలేదని తెలుస్తోంది. మిగిలిన వైద్య పరీక్షలు పూర్తి చేశాక బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. బుధవారం రాత్రి వరకు కూడా తారకరత్న వైద్య పరీక్షల రిపోర్ట్ లు రాకపోతే హెల్త్ బులిటెన్ గురువారం విడుదల చేసే అవకాశం ఉంది.

ప్ర‌స్తుతం వెంటిలేట‌ర్ పైనే తారకరత్నకు చికిత్స కొన‌సాగుతోంది. ఎక్మో ద్వార చికిత్స అందిస్తున్న‌ట్టు వ‌చ్చిన వార్త‌ల‌ను కుటుంబ స‌భ్యులు కొట్టిపారేశారు. మెద‌డుకు సంబంధించి సిటీ స్కాన్ ప‌రీక్ష‌ల రిపోర్టు రావాల్సి ఉంద‌ని, బుధ‌వారం మ‌రికొన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని వైద్యులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం తార‌క‌ర‌త్న తండ్రి మోహ‌న‌కృష్ణ‌, భార్య అలేఖ్య‌రెడ్డి ఆస్ప‌త్రిలో ఉన్నారు.

హెల్త్ బులెటిన్ విడుద‌ల అయిన త‌ర్వాత తార‌క‌ర‌త్న ఆరోగ్యంపై స్ప‌ష్ట‌త రానుంది. మ‌రికొన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించాకే వైద్యులు త‌దుప‌రి చికిత్స‌ను కొన‌సాగించ‌నున్నారు.

Also Read : తారకరత్న భార్యకు ఇదివరకే పెళ్లి అయిందా..?

Exit mobile version