VRO వ్యవస్థ ను రద్దు చేశాక ఒక VRO మనోగతం

తెలంగాణలో VRO అంటే సీఎం గారి దృష్టిలో అవినీతిపరుడు.. ప్రజలు కూడా గొర్రెల్లా ఆయనను అనుసరించేవారు కాబట్టి వారి దృష్టిలో కూడా వీర్వో ఒక అవినీతిపరుడు..
కానీ ఒక వీర్వోగా నా విధులు.. ఒక రోజు ఎలా గడిచిపోతుంది అని తలచుకుంటే..
1)ఉదయం గ్రామానికి వెళ్ళాలి..
a)అక్కడ caste, family member, income, residence certificates, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, fsc card లాంటి పథకాలు enquiry చేసుకోవాలి..
b)విరాసతులు ఉంటే కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు రాసుకోవాలి..
c)ఈలోగా ఏదైనా ఇసుక ట్రాక్టర్ పోతే పట్టుకోవాలి..
…ఇవన్నీ చేసుకొని ఆఫీస్ కి వెళ్లే లోపు ఎక్కడున్నావ్ అంటూ ఎడతెరిపి లేకుండా చేసే ప్రజల ఫోన్ కాల్స్..
2)ఆఫీస్ కి వెళ్లే లోపు సమస్యలు చెప్పుకోడానికి ఎదురు చూసే జనాలు..
అబద్దాలు చెప్పి తమకు భూమి రావాలని గొడవ పెట్టుకొనే మోసగాళ్లు..
న్యాయంగా భూమి పట్టా పొందవలసి ఉన్నప్పటికీ ధరణి అనే software సమస్య ద్వారా పట్టా పొందలేని వారికి మీ సమస్య rdo, jc గారి వద్దకు పంపాము అక్కడ పూర్తి చేసుకొని వస్తాము అని చెప్పినా అర్ధం కాని ప్రజలను ఓపికగా సముదాయించడం..
అబద్దాలు చెప్పే మోసగాళ్లకు రికార్డ్ చూపించి నీకు హక్కు లేదని వాడిని కూడా సముదాయించడం..
వీరందరికీ సమాధానం చెప్పి ఆఫీస్ లోకి వెళ్ళగానే టేబుల్ మీద రాయాల్సి ఉన్న సర్టిఫికెట్స్..
ఇవి కాకుండా అప్పుడే మీసేవలో apply చేసి అర్జెంట్ అంటూ సంతకాల కోసం వచ్చే దరఖాస్తుదారులు….
సరే అని ఇక వ్రాయడం మొదలు పెట్టగానే ప్రతి
సమస్యకు సమాధానం కోసం తహసీల్దార్ పిలవడంతో లోపలికి, బయటికి తిరగడం..
అయినా కష్టపడి సర్టిఫికెట్స్, మ్యుటేషన్, విరసతు ఫైళ్లు పూర్తి చేసుకొని, ri, dt, తహసీల్దార్ సంతకాలు తీసుకొని ధరణి ఆపరేటర్ దగ్గరికి వెళ్లి ఫైల్ ఇచ్చి, అతని బయోమెట్రి పూర్తి చేసుకొని, సెక్షన్ అసిస్టెంట్, dt, తహసీల్దార్ బయోమెట్రి పూర్తి చేసుకొని.. ekyc కోసం దరఖాస్తుదారుడిని పిలవాలి..
ఇందరి బయోమెట్రి అయ్యే లోపు పది సార్లు ఆగిపోయే సర్వర్.. సేత్వార్ విస్తీర్ణం కన్నా sy no విస్తీర్ణం అధికంగా ఉంటే తహసీల్దార్ లాగిన్ లో ఆగిపోయే ఫైల్..
ఇవన్నీ పూర్తి అయే లోపు సాయంత్రం 6 అవుతుంది..
సేత్వార్ విస్తీర్ణం కన్నా sy no విస్తీర్ణం అధికంగా ఉంటే దాని కోసం కంప్యూటర్ లో ఫైల్ సిద్ధం చేసి, పాత పహాణీలు జిరాక్స్ చేసుకొని rdo, జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి..
దాదాపుగా వెళ్ళినప్పుడల్లా rdo, జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లలో ఉంటారు.. అవి పూర్తి అయే లోపు 7-8 అవుతుంది.. అదృష్టం బాగుండి ఆఫిసర్ అవకాశం ఇస్తే, ఆఫీసర్ కి పూర్తిగా explain చేసి sy no సరి చేయించుకోవాలి.. టైం ఇవ్వకపోతే మరుసటి రోజు రావాలి..
ఇవన్నీ పూర్తి అయి ఇంటికి వచ్చేసరికి రాత్రి 9 అవుతుంది..
ఇది వీర్వో గా నా daily life..
ఇప్పుడు వీర్వో వ్యవస్థను రద్దు చేసినందుకు.. ఈ పని భారం అంతా పోయినందుకు సంతోషంగా ఉంది.. 😄😄😄కానీ ఇంత పని ఇప్పుడు ఎవరు చేస్తారన్న ఆశ్చర్యం కూడా ఉంది.. 🤔🤔🤔

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *